English   

కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో రెచ్చిపోయిన ప్ర‌భాస్..

Prabhas
2018-12-25 20:05:47

ప్రభాస్ కు సిగ్గు ఎక్కువ.. అందుకే ఇంటర్వ్యూలు ఇవ్వ‌డు.. టాక్ షోల‌కు రాడు.. ఈ విషయం తెలుగులో ఎవర్ని అడిగినా చెప్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రభాస్ మొహమాటానికి బ్రాండ్ అంబాసిడర్. తన సినిమా వేడుకల్లోనే మాట్లాడటానికి సిగ్గు పడుతుంటాడు యంగ్ రెబల్ స్టార్. అలాంటి ప్రభాస్ ఇప్పుడు కాఫీ విత్ కరణ్ షో లో సంచలన నిజాలు బ‌య‌ట‌పెట్టాడు. చాలా సరదాగా మాట్లాడాడు. ఈయ‌న మాట్లాడిన తీరు చూసి అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. సిగ్గు సిగ్గు అంటూనే బాగానే ఓపెన్ అయ్యాడు ప్రభాస్. అనుష్క తో తన రిలేషన్ గురించి కూడా చెప్పాడు ఈ హీరో. తనకు సినిమాలు తప్ప మరో ప్రపంచం లేదని.. అయితే సినిమాలు లేని టైంలో మాత్రం ప్రపంచంలో తనకంటే లేజీ ఎవరూ ఉండరని చెప్పాడు ప్రభాస్. ఇదే విషయంపై రాజమౌళి, రానా కూడా కన్ఫర్మేషన్ ఇచ్చారు. 

సినిమాలు లేకపోతే ఎప్పుడు ఫామ్ హౌజ్ లోనే ఉంటాడని.. ఫుడ్ తింటూ కూర్చుంటాడని చెప్పాడు ద‌ర్శ‌క‌ధీరుడు. హీరోయిన్లతో ఎఫైర్ ల గురించి చెప్పమంటే వాటికి నేను చాలా దూరంగా ఉంటానని చాలా వినయంగా చెప్పాడు ప్రభాస్. మొత్తానికి తెలుగు మీడియాతో మాట్లాడడానికి అడ్డొచ్చే సిగ్గు బాలీవుడ్లో మాత్రం రాలేదు. అడక్క పోయినా క‌ర‌ణ్ జోహార్ కు రివర్స్ కౌంటర్లు వేసాడు యంగ్ రెబల్ స్టార్. ఈయన జోరు చూసి రానా, రాజమౌళి కూడా షాక్ అయ్యారు. ఇదే జోరు మన తెలుగు మీడియాలో కూడా చూపించొచ్చు కదా అని సెటైర్లు వేశారు. ఈ టాక్ షో చూసిన తర్వాత కచ్చితంగా తెలుగులో కూడా చాలామంది ప్రభాస్ ఇంటర్వ్యూ కోసం ప్రయత్నిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. మ‌రి వాళ్ల‌ను ప్ర‌భాస్ ప‌ట్టించుకుంటాడో లేదో..?

More Related Stories