English   

సూర్య‌కు ఆ తిప్ప‌లు తీరేదెప్పుడు.. ఎన్ జి కే వ‌చ్చేదెప్పుడు..?

Suriya's movie ngk release date not confirm
2018-12-25 20:13:08

కొన్నిసార్లు కొందరు హీరోలు తమ కెరీర్లో తెలియకుండానే కొన్ని సినిమాల విషయంలో ఇరుక్కు పోతుంటారు. ఇప్పుడు సూర్య విషయంలోనూ ఇదే జరిగింది. ఫ్లాపుల్లో ఉన్న సెల్వరాఘవన్ చెప్పిన కథను నమ్మి ఎన్ జి కె సినిమా ఒప్పుకున్నాడు సూర్య. ఎప్పుడో దీపావళికే రావాల్సిన సినిమా ఇంకా రాలేదు.. ఎప్పుడు వస్తుంది అంటే క్లారిటీ లేదు. రకుల్, సాయిపల్లవి ఈ సినిమాలో సూర్యకు జోడీగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయింది. కానీ సినిమా మాత్రం విడుదల కాలేదు. పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లోనే ఇంకా ఉంది ఎన్ జి కే. ఎప్పటికప్పుడు విడుదల ఎప్పుడు అంటే ఇదిగో ఇప్పుడే అంటున్నాడు కానీ ఆ ఎప్పుడు ఎప్పుడో ఎప్పుడూ చెప్పలేదు సూర్య.
ఇప్పుడు కూడా ఎన్ జి కే కొత్త పోస్టర్ విడుదల అయింది. అందులో కూడా విడుదల తేదీని ప్రకటించలేదు ద‌ర్శ‌కుడు సెల్వ రాఘ‌వ‌న్. ఇక సూర్య కూడా ఈ సినిమాని లైట్ తీసుకొని కే.వి ఆనంద్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాపై దృష్టి పెట్టాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది. అయాన్, బ్రదర్స్ సినిమాల తర్వాత కె.వి.ఆనంద్ తో సూర్య చేస్తున్న మూడో సినిమా ఇది. ఇందులో అయ‌న్ బ్లాక్ బస్టర్ కాగా.. బ్రదర్స్ సినిమా మాత్రం నిరాశ పరిచింది. ఆ లోటు ఇప్పుడు మూడో సినిమాతో తీరుస్తారని చెబుతున్నాడు ఆనంద్. ఇక సూర్య కూడా సెల్వరాఘవన్ ఎన్ జి కే సినిమా గురించి ఎక్కువగా ఆలోచించ‌డం మానేసి పూర్తిగా త‌న దృష్టంతా ఆనంద్ సినిమాపైనే పెట్టాడు.

More Related Stories