English   

'భాగమతి' డైరెక్టర్ తో సాయి ధరం తేజ్ ?

Sai-Dharam-Tej
2018-12-25 20:17:37

మెగా మేనల్లుడిగా కెరీర్ ప్రారంభంలోనే మంచి ఫాలోయింగ్‌ తెచ్చుకున్న హీరో సాయి ధరమ్‌ తేజ్‌. ఈ మధ్య వరస ఫ్లాఫ్ లతో ఇబ్బంది పడుతున్నాడు. ఏ డైరక్టర్ తో చేసినా, ఎలాంటి కథ చేసినా ఈ మెగా హీరోకు అస్సలు కలిసి రావడం లేదు. ఈ మధ్యే తన కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు.  ‘నేను శైలజ’ ఫేమ్‌ కిశోర్‌ తిరుమల డైరెక్షన్‌లో ‘చిత్రలహరి’ అనే సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ లో ఉండగానే ఓ సోషియో ఫాంటసీ చిత్రం ఓకే చేసినట్లు సమాచారం. కొరియాగ్రాఫర్‌గా పనిచేసిన జి.అశోక్ ‘ఆకాశరామన్న’తో దర్శకుడిగా మారారు. ‘పిల్ల జమీందార్’తో తొలి విజయం అందుకున్నారు. ఆ తర్వాత సుకుమారుడు, చిత్రాంగద చిత్రాలు నిరాశ పరిచాయి. అనుష్క ప్రధాన పాత్రగా ‘భాగమతి’ తెరకెక్కించి మళ్లీ విజయాల బాట పట్టారు. 2018లో టాలీవుడ్ విజయాలకు నాంది పలికింది ఈ సినిమామే అయినప్పటికీ అశోక్‌కు మాత్రం అవకాశాలు తెచ్చిపెట్టలేదు. ఎట్టకేలకు ఆయనకు ఇప్పుడో అవకాశం వచ్చింది. సాయిధరమ్‌తేజ్‌తో ఆయన కలిసి పనిచేయనున్నారు. భాగమతి లాంటి ఫాంటసీ డ్రామా నేపథ్యంలోనే తెరకెక్కిస్తారని సమాచారం. ‘చిత్రలహరి’ సినిమా పూర్తికాగానే ఈ ప్రాజెక్టు్ పట్టాలెక్కనుందట. మరో ప్రక్క చిత్రలహరి చిత్రాన్ని ఏప్రిల్‌లో రిలీజ్‌ చేయాలని.. అందులోనూ ఏప్రిల్‌ 19న చేయాలని అనుకున్నట్లు సమాచారం. మైత్రీ మూవీస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా దేవీశ్రీప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. 

More Related Stories