English   

మ‌హ‌ర్షి మ‌రో షెడ్యూల్ పూర్తి.. జ‌న‌వ‌రిలో కొత్త షెడ్యూల్..

Mahesh
2018-12-26 13:00:39

మహేష్ బాబు మహర్షి సినిమా ఆర్.ఎఫ్.సి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. జనవరి నుంచి కొత్త షెడ్యూల్ మొదలు కానుందని చెప్పారు సూపర్ స్టార్. ఈ చిత్రం కోసం పూర్తిగా కొత్త లుక్ లోకి మారిపోయాడు మహేష్. ఇందులో పూజా హెగ్డే ఆయనతో జోడీ కట్టింది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మహేష్ 25 సినిమా కావ‌డంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపు షూటింగ్ పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు ద‌ర్శ‌కుడు వంశీ పైడిపల్లి. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి సంయుక్తంగా మహర్షి సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా తన కెరీర్లో మైలురాయిగా నిలిచిపోతుందని న‌మ్ముతున్నాడు మహేష్ బాబు. 

పదేళ్ల కింద షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన స్వదేశ్ సినిమా ఆధారంగా మహర్షి సినిమా తెరకెక్కుతుందని ప్రచారం జరుగుతుంది. రైతు కథాంశంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు వంశీ పైడిపల్లి. భరత్ అనే నేను సినిమాతో మంచి జోరు మీద ఉన్న సూపర్ స్టార్ మహర్షి సినిమాతో మరో హిట్ కొట్టి నెంబర్ గేమ్ లో మరింత ముందుకెళ్లాలని చూస్తున్నాడు. మరోవైపు ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరుగుతుంది. ఇప్పటికే ఓవర్సీస్ రైట్స్ 25 కోట్లకు పైగా కోడ్ చేశారని తెలుస్తోంది. అయితే ఇంత భారీ రేటు పెట్టడానికి అక్కడ బయ్యర్లు భయపడుతున్నారు. భరత్ అనే నేను 3.4 మిలియన్ తీసుకువచ్చినా కూడా సేఫ్ జోన్ కు రాకపోవడంతో ఇప్పుడు మహర్షి సినిమాకు కాస్త తక్కువ రేట్ అడుగుతున్నారు ఓవ‌ర్సీస్ డిస్ట్రిబ్యూట‌ర్లు. మరి దీనికి నిర్మాత దిల్ రాజు ఏమంటాడో చూడాలి. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న మహర్షి సినిమా విడుదల కానుంది.

More Related Stories