English   

ఆ బంగారు గ‌నుల్లో ఏముంది.. కేజియ‌ఫ్ క‌లెక్ష‌న్లు అద‌ర‌హో.. 

KGF-Yash
2018-12-26 07:07:48

కొన్నిసార్లు ఊరు పేరు తెలియని సినిమాలు సంచలనాలు సృష్టిస్తుంటాయి. ఇప్పుడు కన్నడ డబ్బింగ్ సినిమా కే జి ఎఫ్ ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. యశ్ హీరోగా న‌టించిన ఈ సినిమా తెలుగులో కూడా సంచలన విజయం దిశగా అడుగులు వేస్తుంది. ఈ సినిమాకు ముందు య‌శ్ అంటే ఎవరో కూడా ప్రేక్షకులకు తెలియదు. ఆయన ఇమేజ్ పై తెలుగు ప్రేక్షకులకు అసలు ఐడియా కూడా లేదు. కానీ కే జి ఎఫ్ సినిమా మాత్రం తెలుగులో మూడు రోజుల్లోనే 2.5 కోట్ల షేర్ వసూలు చేసి సంచ‌ల‌నం సృష్టించింది. కే జి ఎఫ్ దెబ్బకు అంతరిక్షం, పడిపడి లేచే మనసు కూడా రేసులో వెనకబడిపోయాయి. అంచనాలు లేకుండా వచ్చి అద్భుతాలు చేస్తుంది కే జి ఎఫ్. 

ఈ చిత్రం ఫుల్ రన్లో ఈజీగా 8 కోట్ల మార్కు అందుకునేలా కనిపిస్తుంది. ఇదేగాని జరిగితే తెలుగులో ఈ మధ్యకాలంలో కన్నడ డబ్బింగ్ సినిమాకి ఇవే హైయెస్ట్ కలెక్షన్స్ అవుతాయి. ఎందుకంటే ఉపేంద్ర లాంటి హీరోల సినిమాలు కనీసం ఇక్కడ ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేదు. అలాంటిది య‌శ్ అంటే ఎవరో కూడా తెలియకుండా వచ్చి సంచలనం సృష్టిస్తున్నాడు. ప్రమోషన్ లేకుండానే ఇంతగా పిచ్చెక్కిస్తున్న కే జి ఎఫ్ కు ఒకవేళ తొలి రోజు నుంచి గానీ పిఆర్ఓలు మంచి ప్రమోషన్ చేసి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేదంటున్నారు విశ్లేష‌కులు. సినిమా పక్కా మాస్ మసాలా ఎంటర్ టైన‌ర్ కావడంతో బి,సి సెంటర్లలో కలెక్షన్లు కుమ్మేస్తుంది. మ‌రి కేజియ‌ఫ్ ప్ర‌యాణం ఎక్క‌డివ‌ర‌కు సాగ‌నుందో చూడాలిక‌. 

More Related Stories