English   

ర‌ష్మి ఇంత ఓపెన్ ఏంటి స్వామి..? 

Rashmi-Gautam
2018-12-26 07:35:04

రష్మీ అంటేనే ఫైర్ బ్రాండ్.. అదేదో యాడ్ లో ఇలియానా చెప్పినట్టు దాచుకోడానికి ఏమీ లేదు అన్నట్లు అన్ని ఓపెన్ గా మాట్లాడేస్తుంది ఈ జబర్దస్త్ ముద్దుగుమ్మ. ఇప్పుడు కూడా ఫేస్ బుక్ లైవ్ లో అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకు అసలు మొహమాటం లేకుండా సమాధానం ఇచ్చింది రష్మిగౌతమ్. అందులో కొన్ని సెన్సార్ ప్రశ్నలు కూడా ఉన్నాయి. వాటికి కూడా తడుముకోకుండా సమాధానం చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఫ్యాన్స్ అంటేనే కొన్ని చిలిపి ప్రశ్నలు అడుగుతారు అని ముందే ఊహించింది ఈ భామ. అందుకే తాను కూడా ప్రిపేర్ అయ్యి వచ్చింది. దానికి తగ్గట్టే ప్రశ్నలు కూడా ఉన్నాయక్క‌డ‌. 

లైవ్ మొద‌ల‌వ్వ‌గానే ఓ సంచ‌ల‌న ప్ర‌శ్న ర‌ష్మి ముందు నిలిచింది. అడిగిన దానికంటే ఎక్కువ డబ్బులు ఒక రాత్రి గడపమంటే మీ సమాధానం ఏంటి అని ఒక అభిమాని ప్ర‌శ్న అడిగాడు. దానికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది ర‌ష్మి. అందులో బాధపడాల్సిన విషయం ఏం లేదని.. ఒకవేళ అడిగిన దానికంటే ఎక్కువ డబ్బు ఇస్తానని చెప్తే.. ఆ ఇచ్చేవాడు ఎలా ఉంటాడో చూసి నా సమాధానం ఉంటుందని చెప్పింది రష్మి. ఒకవేళ జబర్దస్త్ అప్పారావు లాంటి వాడు ఆఫర్ ఇస్తే ఏం చేస్తారు అని అతడు మరో ప్రశ్న అడిగాడు. దానికి వెంటనే సమాధానం నో అని చెప్పింది రష్మి. అంతటితో ఆగకుండా పెళ్లి, ప్రేమ ఈ రెండింటిలో దేనికి మీ ఓటు అంటే సహజీవనం అని షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది జబర్దస్త్ భామ. 

సుదీర్, ప్రదీప్ ల‌లో ఎవరో ఒక‌ర్ని పెళ్లి చేసుకోవాల్సి వ‌స్తే ఎవ‌ర్ని చేసుకుంటారు అని మ‌రో ఫ్యాన్ అడిగాడు. దీనికి స‌మాధానంగా త‌ను ఆ ఛాన్స్ తీసుకోన‌ని.. ఎందుకంటే తన ప్రైవేట్ లైఫ్ కు ఎప్పుడో ఎండ్ కార్డ్ వేశానని చెప్పింది రష్మి. ఈ భామ చెప్పిన సమాధానాన్ని బట్టి చూస్తే ప్రస్తుతం ప్రేమలో ఉందనే విషయం అర్థమైపోతుంది. అయితే ఆ వ్యక్తి ఎవ‌ర‌నేది మాత్రం చెప్ప‌ను అనేసింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి ఇంత డేరింగ్ ఆన్సర్స్ చెప్తూ ఫేస్ బుక్ లోనే ఫైర్ అంటించింది రష్మీ.

More Related Stories