English   

బాలకృష్ణకు బంపరాఫర్....ఇక సేఫ్ !

NTR-Biopic
2018-12-26 17:15:55

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ సినిమా కోసం ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు బాలకృష్ణ నటించారనడం కంటే జీవించారనే చెప్పాలి. ట్రైలర్ వచ్చాక బిజినెస్ పరంగా కూడా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. బాలకృష్ణకు ఫ్యాన్ బేస్ బలంగా ఉన్న ఏరియాల నుంచి కనివిని ఎరుగని ఆఫర్లతో డిస్ట్రిబ్యూటర్లు అడ్వాన్స్ లతో వస్తున్నారట. 

మరోపక్క డిజిటల్ హక్కుల్లో కొత్త విప్లవం తెచ్చిన అమెజాన్ ప్రైమ్ ఎన్టీఆర్ మొదటి భాగం కథానాయకుడికి ఏకంగా 25 కోట్ల ఆఫర్ ఇచ్చిందట. తెలుగు తమిళ్ హింది బాషలకు గాను కాంబో ఆఫర్ లో ఈ మొత్తం వచ్చినట్టు సమాచారం. ఎలా చూసుకున్నా ఇది సూపర్ ఆఫర్ అనే చెప్పొచ్చు. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తొలి భాగం జనవరి 9న, రెండో భాగం ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నారు. రెండు భాగాలు కలిసి శాటిలైట్ హక్కుల ద్వారా రూ.45కోట్ల వరకు రావొచ్చని నిర్మాణ సంస్థ ఎన్‌బీకే ఫిల్మ్స్ అంచనా వేస్తోంది. 

ఈ సినిమాను బాలకృష్ణ సొంతంగా NBK ప్రొడక్షన్ లో నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే సాయి కొర్రపాటి - విష్ణు ఇందుకూరి కూడా సహా నిర్మాతలుగా ఉన్నారు. భారీ తారాగణంతో పాటు సెట్స్ ను కూడా గ్రాండ్ నిర్మించడంతో బడ్జెట్ 60 కోట్లు దాటిందని టాక్. ఆ లెక్కన చూసుకుంటే దాదాపు 75% లాభాలు ముందే వచ్చాయి.  

More Related Stories