English   

ఏంటో థ‌మ‌న్.. ఎక్క‌డో విన్న‌ట్లే ఉందే ఈ పాట‌.. 

Mr-Majnu
2018-12-26 10:38:02

ఇప్పుడు అఖిల్ హీరోగా నటిస్తున్న మిస్టర్ మజ్ను కొత్త పాట విన్న త‌ర్వాత అభిమానులు అడుగుతున్న ప్ర‌శ్న ఇదే. రిలీజ్ అయింది కొత్త పాట అని చిత్ర యూనిట్ చెబుతున్నారు కానీ త‌మ‌న్ మాత్రం మరోసారి పాత ట్యూన్ కొట్టినట్టుగా అనిపిస్తుందంటున్నారు అభిమానులు. ఈ ఏడాది మొదట్లో తొలిప్రేమకు చాలా రిఫ్రెషింగ్ మ్యూజిక్ ఇచ్చిన తర్వాత మళ్లీ ఆ స్థాయి పాట‌లు ఏ సినిమాకి ఇవ్వలేదు థ‌మ‌న్. మధ్యలో అరవింద సమేత లాంటి సినిమాలకు కూడా ఏదో అలా లాగేసాడు ఈ కుర్ర సంగీత ద‌ర్శ‌కుడు. మళ్లీ ఇప్పుడు వెంకీ అట్లూరి సినిమా కోసం మంచి మ్యూజిక్ ఇస్తాడని ఆశిస్తున్నారు అభిమానులు. కానీ ఇప్పటి వరకు విడుదలైన మిస్టర్ మజ్ను రెండు పాటలకు పెద్దగా ఆదరణ అయితే రాలేదు. ఎప్పట్లాగే మరోసారి నిరాశ పరిచాడు తమన్. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తయిపోయింది. జనవరి 25న మిస్టర్ మజ్ను విడుదల కానుందని తెలుస్తుంది. 

గత ఏడాది డిసెంబర్లో హలో సినిమాతో వచ్చిన అక్కినేని వారసుడు.. ఏడాది గ్యాప్ తీసుకుని ఇప్పుడు మిస్టర్ మజ్ను అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాతో హిట్ కొట్టి తాను కూడా రేసులోనే ఉన్నానని నిరూపించుకోవడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు అఖిల్. తొలిప్రేమ విజయంలో కీలకపాత్ర పోషించిన సంగీత దర్శకుడు తమన్.. అఖిల్ విషయంలోనూ అదే చేస్తాడని న‌మ్ముతున్న అభిమానులకు ఇప్పుడు వినిపిస్తున్న పాట‌లు భ‌యం రేపుతున్నాయి. ఇప్పటివరకు విడుదల రెండు పాటలు కూడా యావరేజ్ గానే ఉన్నా.. మిగిలిన పాట‌లతో ఏదో ఓ అద్భుతం చేస్తాడని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. పూర్తి ఆల్బమ్ జనవరిలో విడుదల కానుంది. మరి అక్కినేని అభిమానుల ఆశల్ని తమన్ ఎంతవరకు నిలబడతాడో చూడాలి. ఈ చిత్రంలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తుంది. 

More Related Stories