English   

అర‌వింద స‌మేత‌ను స‌వాల్ చేస్తున్న మ‌హాన‌టి.. 

Aravinda-Sametha
2018-12-26 11:27:11

కొన్ని సినిమాలు చాలా తక్కువ అంచనాలతో మొదలై చరిత్రలో మిగిలిపోతుంటాయి. ఆ తర్వాత వాటిని టచ్ చేయాలన్న ఆలోచన కూడా భయమేస్తుంది. ఆ స్థాయికి ఎదిగిపోతాయి కొన్ని సినిమాలు. ఆ జాబితాలో ముందు వరసలో ఉంటుంది మహానటి. థియేటర్స్ లోనే కాదు టీవీలో కూడా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఈ ఏడాది వచ్చిన అన్ని సినిమాల్లో టాప్ లో ఉంది మహానటి. టీర్పీల్లో 20.21 రేటింగ్ తో ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో ఉంది మహానటి. ఈ ఏడాది విడుదలైన‌ ఏ సినిమా కూడా మహానటిని టిఆర్పి రేటింగ్స్ లో బీట్ చేయలేకపోయింది. ఆఖరికి 100 కోట్లు వసూలు తెచ్చుకున్న గీతగోవిందం కూడా మహానటి కంటే వెన‌కే ఉంది. ఈ సినిమాకు 20.8 రేటింగ్ వచ్చింది. ఇప్పుడు మహానటి రికార్డును ఎలాగైనా బ్రేక్ చేయాలని బయలుదేరాడు అరవింద సమేత వీర రాఘవుడు. త్వరలోనే ఈ సినిమా బుల్లితెరపై రానుంది. 

కచ్చితంగా ఎన్టీఆర్ ఈ రికార్డును బ్రేక్ చేస్తాడని న‌మ్ముతున్నారు అభిమానులు. ఎన్టీఆర్ సినిమాలు బుల్లితెర‌పై సంచలనాలు సృష్టిస్తుంటాయి. అదే దారిలో ఇప్పుడు అరవింద సమేత కూడా టిఆర్పి రేటింగ్స్ లో సరికొత్త చరిత్రకు నాంది ప‌లుకుతుందేమో..? మూడేళ్ల కింద వచ్చిన టెంపర్ తెచ్చిన 26.6 రేటింగ్ ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు టెలివిజన్ చరిత్రలోనే హైయ్య‌స్ట్. ఆ తర్వాత ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ఎన్టీఆర్ రికార్డ్ బ్రేక్ చేయలేకపోయాయి. ఇప్పుడు ఇదే దారిలో మహానటి రికార్డుల‌ను కూడా ఎన్టీఆర్ కొల్ల‌గొడ‌తాడ‌ని ఆశిస్తున్నారు అభిమానులు. పైగా త్రివిక్రమ్ సినిమాల‌కు కూడా బుల్లితెరపై మంచి రికార్డు ఉంది. ఒక అజ్ఞాతవాసి సినిమా తప్ప మిగతా అన్ని సినిమాలు చిన్నితెరపై రికార్డు సృష్టించాయి. మరి ఇప్పుడు అరవింద సమేత ఎలాంటి కొత్త సంచలనాలకు తెర తీస్తుందో చూడాలి.

More Related Stories