English   

క్రిస్మ‌స్ కానుక‌గా బికినీలో స్నేహాఉల్లాల్.. 

Sneha-Ullal
2018-12-26 12:02:06

క్రిస్మస్ రోజు అందరూ సాధారణంగానే గిఫ్ట్ లు ఇచ్చుకుంటారు. ఇప్పుడు స్నేహాఉల్లాల్ కూడా ఇదే చేసింది. కాకపోతే ఈ భామ అందాల విందు ఇచ్చింది. అది కూడా మామూలుగా కాదు.. చూడగానే కళ్ళు పేలిపోయేలా. క్రిస్మస్ ట్రీ దగ్గర నిలబడి బికినీలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోసింది ఈ జూనియర్ ఐశ్వర్యరాయ్. అమ్మడిని చూడగానే వామ్మో అనిపించేలా ఉంది. ఈ మధ్యకాలంలో సినిమాలకు బాగా దూరం అయిపోయిన స్నేహ ఉల్లాల్.. ఇలా ప్రేక్షకులకు చేరువ అవుతుంది. మొన్నీమధ్య చేతులతో ప‌ళ్ల‌బుట్ట ప‌ట్టుకుని బీచ్ లో బికినీ దగ్గర అందాలు ఆరబోసిన స్నేహ.. ఇప్పుడు క్రిస్మస్ ట్రీ దగ్గర అదే పని చేసింది. 

ఈ ముద్దుగుమ్మను చూసిన కుర్రాళ్లకు నిద్ర కరువవుతుందిప్పుడు. అంతలా అందాలు ఆరబోస్తుంది. ఇది చూసిన తర్వాతైనా ఎవ‌రో ఓ ద‌ర్శ‌కుడు కరుణించకపోతాడా అని ఆశిస్తుంది స్నేహాఉల్లాల్. తెలుగులో అప్ప‌ట్లో ఉల్లాసంగా ఉత్సాహంగా, సింహా, క‌రెంట్ లాంటి సినిమాల్లో న‌టించింది స్నేహా. విజ‌యాలు ఉన్నా కూడా ఎందుకో కానీ తెలుగు ఇండ‌స్ట్రీలో స్నేహాను ప‌ట్టించుకోలేదు. ప్రస్తుతం ఈ భామ తెలుగు, తమిళ, మలయాళ.. ఇలా ఏ ఇండస్ట్రీలోనూ సినిమాలు చేయట్లేదు, అందుకే ఇలా అందాల బాణాలు వదులుతుంది. కనీసం ఇప్పుడైనా ఆ అందాల బాణాల‌కు ఫలితం వస్తుందో లేదో చూడాలి.

More Related Stories