English   

అఖిల్ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నాడా..? 

Akhil
2018-12-26 19:36:41

అఖిల్ అనవసరంగా హిట్ కొట్టే ఛాన్స్ మిస్ చేసుకున్నాడా.. అద్భుతమైన‌ అవకాశం చేజేతులా వదిలేసుకున్నాడా.. ఏమో ఇప్పుడు ఇండస్ట్రీలో ఇలాంటి వార్త‌లే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈయన మిస్టర్ మజ్ను సినిమా ముందు విడుదల కావాల్సింది డిసెంబర్లోనే. కానీ షూటింగ్ ఆల‌స్యం అయిందంటూ ఈ సినిమాను జనవరికి పోస్ట్ ఫోన్ చేశాడు అఖిల్. కానీ అసలు కారణం అది కాదని.. డిసెంబర్ 21న పడిపడి లేచే మనసుతో పాటు  అంతరిక్షం సినిమాలు వస్తున్న కారణాన తన సినిమాను జనవరికి వాయిదా వేసుకున్నాడని అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే అన్నీ అనుకున్నట్లు జరిగే ఒకవేళ డిసెంబర్లో మిస్టర్ మజ్ను సినిమా వచ్చుంటే.. బాక్సాఫీస్ దగ్గర అఖిల్ పండగ చేసుకునే వాడని అంటున్నారు ఫ్యాన్స్. 

ఎందుకంటే ఇప్పుడు విడుదలైన అంతరిక్షం, పడిపడి లేచే మనసు రెండూ నెగిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. వీకెండ్ అయ్యేలోపు ఈ చిత్రాలు రెండు ప్లాప్ అని డిసైడ్ చేసారు ప్రేక్షకులు. దాంతో అద్భుతమైన అవకాశాన్ని అఖిల్ చేసుకున్నాడని బాధపడుతున్నారు అభిమానులు. అయినా జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఆలోచించి లాభం లేదు. జనవరి 25న కంగనా రనౌత్ మణికర్ణిక సినిమాకు పోటీగా మిస్టర్ మజ్ను వస్తుంది. మరి హలో తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని వస్తున్న ఈ సినిమాతో అఖిల్ హిట్ కొడతాడో లేదో చూడాలి. తొలిప్రేమ తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న సినిమా ఇది. మరి అఖిల్ ఆశలను మనం మజ్ను ఎంతవరకు తీరుస్తాడో చూడాలి.

More Related Stories