English   

రాముడి కోసం తారకరాముడు...అనుబంధం పెరిగినట్టే ?

trs working president ktr attend ram charan's vvr movie pre release event
2018-12-26 19:54:17

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, మాస్ట్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శీను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ విన‌య విధేయ రామ‌ విడుదలకు ముందే మరింత క్రేజ్ పెంచుకుంటోంది. సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానున్న ఈ సినిమాకి సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 27న యూస‌ఫ్‌గూడ‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో జ‌రిపేందుకు స‌న్నాహాలు జరుపుతోంది చిత్ర యూనిట్. అయితే ముందు నుండీ ఈ కార్యక్రమానికి జక్కన్న, ఎన్టీఆర్ లు ముఖ్య అతిధులుగా వస్తారని ప్రచారం జరిగింది, ఆ తర్వాత చిరంజీవిని ముఖ్య అతిధిగా పిలవనున్నారని ఇలా రకరకాలగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ కార్య‌క్ర‌మానికి టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజ‌రు కానున్నారు. అయితే  టీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పగ్గాలు చేపట్టిన తర్వాత కేటీఆర్ వస్తున్న పబ్లిక్ మీటింగ్ ఇదే. అదీ కాక కేటీఆర్ - రామ్ చరణ్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. గతంలో దృవ ఆడియో ఫంక్షన్ హైదరాబాద్ లోని కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి కేటీఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. సినిమా సూపర్ హిట్ అయ్యింది. అందుకే సెంటిమెంట్ గా భావించి మళ్లీ అదే ప్లేస్ లో ఆడియో లాంచ్ ని ఏర్పాటు చేశారు. చీఫ్ గెస్ట్ గా కేటీఆర్ ని కూడా అహ్వానించారు. ఇప్పుడు మరోమారు ఆయన చరణ్ కోసం వస్తుండడంతో చరణ్ తో ఆయనకు అనుబంధం చాలా పెరిగిందని టాక్ వినిపిస్తోంది. మరోపక్క సినిమా విషయానికి వస్తే ఇప్పటికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌, వీడియోస్ సినిమాపై ఆస‌క్తిని పెంచేస్తున్నాయి. స్నేహా, వివేక్‌ ఒబెరాయ్‌, ప్రశాంత్‌, అనన్య, ఆర్యన్‌ రాజేష్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించగా కొంత గాప్ తీసుకున్న దేవి శ్రీ ప్ర‌సాద్ త‌నదైన శైలిలో సంగీతం అందించారు. కియారా అద్వానీ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఇషా గుప్తా స్పెష‌ల్ సాంగ్‌తో అల‌రించనుంది. యాక్షన్‌కు ప్రాధాన్యం ఇస్తూ ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నట్టు తెలుస్తుంది.

 

More Related Stories