English   

త్రివిక్రమ్ పోయి పరశురాం వచ్చే !

Allu-Arjun
2018-12-26 13:06:38

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చివ‌రి చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. మే 4న విడుద‌లైన ఈ చిత్రం అభిమానుల‌ని నిరాశ‌ప‌ర‌చిన సంగతి తెలిసిందే. దీంతో అల్లు అర్జున్ కొత్త సినిమా ప్రకటన కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో బ‌న్నీ త‌దుపరి ప్రాజెక్ట్ విష‌యంలో చాలా జాగ్ర‌త్తలు తీసుకుంటున్నాడు. విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ నెక్ట్స్ మూవీ ఉంటుంద‌ని మొద‌ట ప్ర‌చారం జ‌రిగినా, ఆ త‌రువాత బ‌న్నీని త్రివిక్ర‌మ్ డైరెక్ట్ చేయ‌నున్నాడ‌ని అంటున్నారు. కాని దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. 

తాజా స‌మాచారం ప్ర‌కారం అల్లు అర్జున్‌ ఇటీవ‌ల గీతా గోవిందం చిత్రంతో భారీ హిట్ కొట్టిన ప‌ర‌శురామ్‌తో క‌లిసి పనిచేయ‌నున్నాడ‌ని అంటున్నారు. ప‌ర‌శురాం గ‌తంలో బ‌న్నీ సోద‌రుడు శిరీష్ ప్ర‌ధాన పాత్ర‌లో శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు అనే చిత్రాన్ని తెర‌కెక్కించి మంచి విజ‌యాన్ని అందించిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌ త‌ర్వాతి ప్రాజెక్ట్ కూడా గీతా ఆర్ట్స్‌లోనే ఉండ‌నుంది. బ‌న్నీ ప్ర‌ధాన పాత్ర‌లో ప‌ర‌శురాం తెర‌కెక్కించనున్న చిత్రం ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ నేప‌థ్యంలో ఉంటుంద‌ని తెలుస్తుంది. సినిమా ఖరారైపోయిందని, కొత్త సంవత్సరంలోకి అడుపెట్టే రోజున అధికారిక ప్రకటన ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్.
వాస్తవానికి ఈ వార్తను పరశురాం సైతం పరోక్షంగా ఖరారు చేశారు.

సోమవారం పరశురాం పుట్టినరోజు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన తన తరవాత సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్‌లోనే ఉంటుందని, ఓ స్టార్ హీరో నటిస్తున్నారని చెప్పారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ప్రారంభమైందని చెప్పుకొచ్చారు, అయితే ఆ స్టార్ హీరో పేరును పరశురాం వెల్లడించకపోయినా కచ్చితంగా అల్లు అర్జునేనని అంటున్నారు. పరశురాం చెప్పిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ, దేవుడికి మనిషికి మధ్య జరిగే ఒక ఆసక్తికరమైన కథనం బన్నీకి బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపారట. వాస్తవానికి రవితేజ తప్ప మరే స్టార్ హీరోతో ఇప్పటి వరకు పరశురాం పనిచేయలేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే ఆయన జాక్‌పాట్ కొట్టినట్టే. త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది.

More Related Stories