English   

అబ్ధుల్ క‌లాం బ‌యోపిక్‌...కాలంగా స్టార్ హీరో !

Anil Kapoor play role of A. P. J. Abdul Kalam
2018-12-26 13:13:40

అటు బాలీవుడ్లోను ఇటు టాలీవుడ్లోను బయోపిక్ ల జోరు కొనసాగుతోంది. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డిల బయోపిక్స్ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాయి. ఇక కాంతారావు బయోపిక్ సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతోంది. వ‌రుస బ‌యోపిక్ లు సినీ ల‌వ‌ర్స్ ని సంతృప్తి ప‌రుస్తుండ‌గా, ఇప్పుడు అబ్ధుల్ క‌లాం బ‌యోపిక్ ని రూపొందించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన అబ్దుల్ కలామ్ దేశం గర్వించదగిన సైంటిస్ట్ గా ఎలా ఎదిగారు? అనే విషయంపై ఈ బయోపిక్ ఆసక్తికరంగా కొనసాగుతుందని అంటున్నారు. గత ఏడాది కలాం పుట్టినరోజున ఇస్రో ఛైర్మ‌న్ ఏఎస్ కిర‌ణ్ కుమార్ చేతుల మీదుగా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేయించారు. డాక్ట‌ర్ అబ్ధుల్ క‌లాం అనే టైటిల్ తో ఈ చిత్రం తెర‌కెక్క‌నుండ‌గా హీ డ్రీమ్, హీ కంక‌ర్డ్ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. అబ్ధుల్ కలాం జీవితంపై రాజ్ చెంగ‌ప్ప రాసిన బుక్ ఆధారంగా ఈ సినిమాని తెర‌కెక్కించ‌నున్న‌ట్టు స‌మాచారం. అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్ కలసి ఈ సినిమాను నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ను కూడా పూర్తి చేసినట్టుగా చెబుతున్నారు. క‌లాం పాత్ర‌లో బాలీవుడ్ స్టార్ అనీల్ క‌పూర్ న‌టిస్తార‌ని టాక్‌. ఇటీవ‌ల అనీల్ క‌పూర్‌ని క‌లిసి స్క్రిప్ట్ వినిపించ‌గా, అది ఆయ‌న‌కు ఎంత‌గానో న‌చ్చ‌డంతో అబ్ధుల్ క‌లాం బయోపిక్‌లో న‌టించేందుకు ఈ బాలీవుడ్ స్టార్ ఎంతో ఉత్సాహంగా ఉన్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌పై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది. వ‌చ్చే ఏడాది నుండి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఈ చిత్రం రాజ్ చెంగప్ప వ్రాసిన కలాం జీవిత చరిత్ర ఆధారంగా రూపొంద‌నుంది. 

More Related Stories