English   

ఇలా గాసిప్స్ రాసి ప్రశాంతంగా ఎలా నిద్రపోతారు ?

Fatima-Sana
2018-12-26 20:13:43

బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ రూపొందించిన దంగల్ చిత్రం ద్వారా ప్రేక్షకాదరణ మూటగట్టుకొన్న అందాలభామ ఫాతిమా సనా షేక్ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రంలోనూ కీలకమైన పాత్రను దక్కించుకొన్నది. అయితే ఇటీవల కాలంలో అమీర్‌ఖాన్, ఫాతీమా సనా షేక్ మధ్య అఫైర్ కొనసాగుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో వీరి బంధంపై అటు మీడియాలోనూ, ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ చర్చనీయాంశమైంది. అమీర్ ఖాన్ తో తనకు స్నేహానికి మించిన సంబంధం ఉందంటూ మీడియాలో వస్తున్న వార్తలపై బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ మండిపడ్డారు. అయినా ఇలాంటి వార్తలు రాసి వారు ప్రశాంతంగా ఎలా నిద్రపోగలుగుతున్నారో' అంటూ చురకలంటించింది. ఈ వార్తలు చాలా అసహ్యంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. అమీర్ తో తనకు లింక్స్ ఉన్నాయనే వార్తను ఓ టీవీ చానెల్ లో ప్రసారం చేశారని ఆ వార్తను చూసి తాను, అమ్మ ఇద్దరం చాలా బాధ పడ్డామని తెలిపింది. ఇలాంటి నిందలను చెరిపివేసుకునే బాధ్యత తమపైనే ఉంటుందని చెప్పింది. కోపాన్ని తట్టుకోలేకపోతే వార్త రాసిన వారిపై దాడి చేస్తామని లేకపోతే సదరు వార్తపై క్లారిటీ ఇస్తామని తెలిపింది. తనకైతే ఈ తప్పుడు వార్తలపై స్పందించాల్సిన అవసరం లేదనిపిస్తోందని చెప్పింది. 

More Related Stories