English   

బిజీబిజీగా కాజల్....దాన్ని మర్చిపోలేదట !

Kajal
2018-12-26 20:17:47

లక్ష్మి కల్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చి పుష్కరకాలంగా తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్న పంజాబీ బ్యూటీ కాజల్ అగర్వాల్. చందమామలా వెలుగులీనుతూ ఇప్పటికీ యువ హృదయాల్ని కొల్లగొడుతూనే ఉంది. కెరీర్ లో ఎన్నో జయాపజయాల్ని చవిచూసిన ఈ బ్యూటీ ‘మగధీర’ సినిమా తన సినీ జీవితంలో కీలక మలుపులా నిలిచిందని చెప్పుకొచ్చింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కాజల్ “మగధీర’ సినిమా తర్వాతే తన కెరీర్ లో గోల్డెన్ మొదలయ్యాయని, అప్పటి నుండే వరుసగా మంచి సినిమాల్లో అవకాశాలు లభించాయని చెప్పుకొచ్చింది. నటిగా తన ప్రతిభాసామర్థ్యాల్ని పూర్తిస్థాయిలో నిరూపించుకునే అవకాశం ఆ సినిమా తర్వాతే దక్కిందమో ఆమె చెప్పింది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ‘భారతీయుడు-2’ చిత్రంలో కమల్ సరసన కథానాయికగా నటిస్తున్నది. ఈ చిత్రం కోసం కాజల్ సంప్రదాయ విద్యల్ని నేర్చుకుంతొందట. ఈ సినిమా ఆమె కెరీర్ ను మరో మెట్టు ఎక్కిస్తుందన్న నమ్మకంలో కాజల్ ఉందట. ఈ సినిమాతో పాటు ‘క్వీన్’ తమిళ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’లోనూ కాజల్ కథానాయికగా నటిస్తున్నది. తెలుగులో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అంటే ఒకరకంగా కాజల్ ప్రస్తుతం బిజీగానే ఉందన్న మాట.

More Related Stories