English   

టీడీపీ ఎమ్మెల్యేకి వర్మ లీగల్ నోటీసు

RGV
2018-12-26 13:23:19

రామ్ గోపాల్ వర్మ ‘వెన్నుపోటు’ సాంగ్‌తో రచ్చ చేస్తున్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇటీవల ‘దగా.. కుట్ర’ పాటను వర్మ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ‘వెన్నుపోటు’ పాట విషయమై ఆ పాట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కించపరిచేలా ఉందంటూ ఆ పార్టీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై పరువునష్టంతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో.. వివాదాన్ని మరింత రాజేసి పబ్లిసిటీ రాబట్టుకోవడమే లక్ష్యంగా వర్మ అడుగులు వేస్తున్నారు.  తాజాగా దీనికి రామ్ గోపాల్ వర్మ కౌంటర్ ఇచ్చారు. ఎస్వీ మోహన్ రెడ్డికి తన న్యాయవాది ప్రభాకర్ ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ టీజర్‌లో ఎవరినీ కించపరచలేదని చెప్పిన ఆర్జీవీ చంద్రబాబు పరువుకు నష్టం వాటిల్లితే కేసు పెట్టాల్సింది ఆయనేనని, ఎమ్మెల్యే కాదని ఆ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. తన పై పెట్టిన తప్పుడు కేసును 48 గంటల్లోగా ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలని, లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వర్మ డిమాండ్‌కు అనుగుణంగా ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పకపోతే వివాదం మరింత ముదురుతుంది, వర్మకు అనుకున్న పబ్లిసిటీ దొరుకుతుంది. 
 

More Related Stories