English   

పూజా ప్రేమలో ప్రభాస్..స్టోరీ అదేనా ?

Prabhas
2018-12-26 20:33:05

ప్రస్తుతం ప్రభాస్ 'సాహో' సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. మరోవైపు ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగుతో పాటు మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరెకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ఒక షెడ్యూల్ షూటింగును పూర్తిచేసుకుంది. ఈ సినిమా 1960 కాలంనాటి ప్రేమకథగా రూపొందుతుందనీ, శ్రీమంతుడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడనే వార్త ఇటీవలే బయటికి వచ్చింది.  

అయితే ఈ సినిమాలో పూజా హెగ్డే పేదింటి అమ్మాయిగా కనిపించనుందనేది తాజా సమాచారం. ఈ పేదింటి అమ్మాయి ప్రేమలో అంతటి శ్రీమంతుడు ఎలా పడతాడు? అందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుందట. అనూహ్యమైన మలుపులతో కొనసాగుతూ ఈ కథ కట్టి పడేస్తుందని అంటున్నారు. ప్రభాస్ ఈ చిత్రంలో సరికొత్త లుక్ లో నడిపించబోతున్నాడు.

బాహుబలి చిత్రంలో రాజులకాలం నాటి ఆహార్యంతో మెప్పించిన ప్రభాస్ సాహో చిత్రంలో స్టైలిష్ లుక్ లోకి మారాడు. ఇక రాధాకృష్ణ దర్శత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 1960 కాలం నాటిది కావడంతో ప్రభాస్ బరువు తగ్గి కనిపించబోతున్నాడట. బాహుబలి తరువాత ప్రభాస్ కు దేశవ్యాప్తంగా మార్కెట్ పెరిగింది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఈ ప్రేమకథను తెలుగుతో పాటు తమిళ .. మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.  

More Related Stories