English   

మళ్ళీ బాలకృష్ణని టార్గెట్ చేసిన నాగబాబు !

Naga-Babu
2018-12-27 11:08:59

మెగా బ్రదర్ నాగబాబు బాలకృష్ణని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఆ మధ్య ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణ గురించి ఉద్దేశించి బాలయ్య బాబు గురించి చెప్పండి అని అడిగితే, సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బాలయ్య గురించి మాట్లాడారు నాగబాబు. తాము అడిగింది బాలయ్య గురించి కాదని నందమూరి బాలకృష్ణ గురించి అని రిపోర్టర్ గుర్తు చేస్తే నందమూరి బాలకృష్ణ ఎవరో తనకు తెలియదంటూ వ్యాఖ్యానించిన మెగాబ్రదర్‌ నాగబాబు తాజాగా ఆయనే లక్ష్యంగా ఫేస్‌బుక్‌లో మరో పోస్ట్‌ చేశారు.  ఓ బాలుడు చక్కగా ఏ మాత్రం తడబడకుండా దేశభక్తి గీతం ‘సారే జహాసే.. అచ్చా’ ఆలపించిన వీడియోను తన ఫేస్‌బుక్‌ పేజీలో పంచుకున్నారు. నాగబాబు ఏ ఉద్దేశంతో పోస్ట్‌ చేసినప్పటికీ మెగా అభిమానులు మాత్రం బాలయ్యకు కౌంటర్‌గానే అని భావిస్తున్నారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బాలయ్య ‘సారే జ‌హాసె అచ్చా’ గీతాన్ని తడబడుతూ పాడి న‌వ్వుల‌పాలైన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేసింది. బాలకృష్ణ దేశభక్తి గీతాన్ని అలా ఖూనీ చేయడంపై ఎంతో మంది నెటిజన్లు విరుచుకుపడ్డారు, మరెంతో మంది సోషల్ మీడియాలో బాలకృష్ణ ని బాగా ట్రోలింగ్ చేశారు. 2018 సంవత్సరంలో సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ కు గురైన నటుల్లో బాలకృష్ణ మొదటి స్థానంలో ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు కూడా వచ్చాయంటే దానికి ఈ సారే జహాసే అచ్చా పాటని బాలకృష్ణ ఖూనీ చేసిన తీరే కారణం. దాంతో ఇప్పుడు నాగబాబు పేరు ప్రస్తావించక పోయినప్పటికీ బాలకృష్ణ ను ఉద్దేశించి నాగబాబు ఇలా చేశాడని బాలకృష్ణ అభిమానులు మండిపడుతున్నారు.  తాజా వీడియో ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసిందనే చెప్పాలి. 

More Related Stories