English   

కేజీఎఫ్.. అన్నిచోట్లా క‌లెక్ష‌న్ల సంచ‌ల‌నాలే.. 

KGF
2018-12-27 04:24:54

కేజిఎఫ్.. ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో విన్నా ఇదే పేరు వినిపిస్తుంది. దానికి కారణం ఈ చిత్రం సృష్టిస్తున్న సంచలనం. విడుదలైన‌ రోజు నుంచి ఇప్పటి వరకు వసూళ్ల ప్రభంజనం ఆగడం లేదు. కన్నడతో పాటు మిగిలిన ఇండస్ట్రీలను కూడా పూర్తిగా దత్తత తీసుకుంది కేజిఎఫ్. బాలీవుడ్లో కూడా ఈ చిత్రం అద్భుతమైన వసూళ్లు సాధిస్తుంది. ఇదే ఇప్పుడు అందరికీ ఆస‌క్తిక‌రంగా మారింది. కన్నడ సినిమా ముంబైకి వెళ్లి అక్కడ విజయం సాధించడం ఏంటి అంటూ అందరూ విచిత్రంగా చూస్తున్నారు. బాలీవుడ్ దృష్టిలో కన్నడ ఇండస్ట్రీ అనేది ఒకటి ఉందని కూడా తెలియదు. అలాంటిది ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లి సంచలన వసూళ్లు సాధిస్తుంది కేజిఎఫ్. షారుక్ ఖాన్ జీరో సినిమాను సైతం ఈ చిత్రం ఓడించింది. తమిళ్లో కూడా ఈ చిత్ర సంచలనాలు కొనసాగుతున్నాయి. అక్కడ ధ‌నుష్ మారి 2 ఈ చిత్రం దెబ్బ‌కు బ‌లైపోయింది. 

తెలుగులో కేజీఎఫ్ తాకిడికి పడి పడి లేచే మనసు, అంతరిక్షం సినిమాల అడ్రస్ గ‌ల్లంతైంది. కన్నడ లో చెప్పాల్సిన పనిలేదు. అక్కడైతే ఆల్ టైమ్ రికార్డులు తిరగరాస్తూ దున్నేస్తున్నాడు కుర్ర హీరో య‌శ్. ఓవర్సీస్ లోనూ కేజిఎఫ్ దూకుడు తగ్గట్లేదు. అక్కడ ఈ సినిమా ఇప్పటికే నాలుగు లక్షల డాలర్లు వసూలు చేసి.. మిలియ‌న్ మార్క్ వైపు పరుగులు తీస్తుంది. ఇదేగాని జరిగితే కన్నడ సినిమా ఓవర్సీస్ లో కొత్త చరిత్ర‌కు తెర‌తీసిన‌ట్లే. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 110 కోట్లు వసూలు చేసిన కేజిఎఫ్.. ఫుల్ రన్ లో 200 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ గురించి ఎవరికీ పెద్దగా తెలియకపోవడం ఈ చిత్రానికి ప్ల‌స్ అయింది. మొత్తానికి కేజిఎఫ్ ఇప్పుడు అన్ని ఇండ‌స్ట్రీల్లోనూ హాట్ టాపిక్ అయిపోయింది. 

More Related Stories