English   

బాపురే.. మ‌హ‌ర్షి పాట లీక్ అయిందా..?

Maharishi
2018-12-27 05:15:17

ఈ రోజుల్లో సినిమా చేయడం కాదు.. తీసిన సినిమాను కాపాడుకోవడం దర్శక నిర్మాతలకు తలకు మించిన భారం అవుతుంది. పాపం వాళ్ళు ఏళ్ల పాటు కష్టపడి చేసిన సినిమాను విడుదలకు ముందే లీక్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. ఆ మధ్య గీతగోవిందం, టాక్సీవాలా సినిమాలకు ఇదే ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు ఏకంగా మహేష్ బాబు 25వ‌ సినిమా మహర్షిని టార్గెట్ చేశారు లీకు రాయుళ్లు. ఈ సినిమాలో ఒక పాట ఆన్ లైన్ లో విడుదలైందనే వార్తలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. దీనిపై చాలా త్వరగా మేల్కొంది చిత్ర యూనిట్. మొత్తానికి ఎలాగోలా ఈ పాట ఉన్న లింకు కనుక్కొని తీయించేసారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కు బ్రేక్ ఇచ్చాడు వంశీ పైడిపల్లి. జనవరిలో కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. మహేష్ బాబు 25వ‌ సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి. ఇలాంటి సమయంలో చిత్రంలోని పాట లీక్ కావడం అభిమానులను కంగారుపెడుతోంది. 

అయితే లీకుల‌తో త‌మ సినిమాకు వచ్చిన ఇబ్బందేమీ లేదని నిర్మాతలు చెబుతున్నారు. తమ సినిమాలో దమ్ము ఉందని ఇలా లీక్ చేయడం వల్ల తమ సినిమా వీక్ కాదని చెబుతున్నారు వాళ్ళు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న మహర్షి సినిమా విడుదల కానుంది. పూజా హెగ్డే ఈ సినిమాలో మహేష్ బాబుతో జోడీకట్టింది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. రైతు క‌థాంశంతో మ‌హ‌ర్షి సినిమా వ‌స్తుంది. అయినా ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో లీకులు బాగా ఎక్కువైపోతున్నాయి. కొందరు సినిమాకు పని చేసిన వాళ్లే అత్యుత్సాహంతో లింకులు బయటకి వదిలేస్తున్నారు. మ‌హ‌ర్షి విష‌యంలో అలాంటిది ఏమైనా జరిగిందా అని ఆరా తీస్తున్నారు దర్శక నిర్మాతలు. ఏదైనా ఆదిలో తుంచేయ‌డమే స‌రైంది. లేదంటే జ‌రిగే న‌ష్టం దారుణంగా ఉంటుంది. 

More Related Stories