English   

విజయ్ బాలీవుడ్ సినిమా రిజెక్ట్ చేశాడా ?

Vijay-devarakonda
2018-12-27 09:28:02

అర్జున్ రెడ్డి సినిమా ముందు వరకూ తెలుగులో విజయ్ దేవరకొండ అంటే ఒక ఎదుగుతున్న హీరో. ఏమంటూ బోల్డ్ సబ్జెక్ట్ అర్జున్ రెడ్డి ఓకే చేశాడో, ఆ సినిమా విజయ్ ని ఓవర్ నైట్ స్టార్ ని చేసేసింది. ఆ దెబ్బకి వరుసగా అన్నీ హిట్లే హిట్లు. అయితే కొద్ది రోజులుగా విజయ్ దేవరకొండ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌తో నటిస్తున్నాడన్న వార్తలు వస్తుండగానే ఓ బాలీవుడ్ అవకాశం అతడి తలుపు తట్టింది. 1983 వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘83’లో విజయ్‌కి అవకాశం వచ్చింది. ఈ సినిమాలో కపిల్‌దేవ్‌గా రణ్‌వీర్ సింగ్ లీడ్ రోల్ పోషిస్తుండగా కృష్ణమాచారి శ్రీకాంత్‌ పాత్ర కోసం విజయ్‌ని అడిగారట.  అయితే బాలీవుడ్ లో అడుగు పెడితే హీరోగానే పెట్టాలనే ఆలోచనలో ఉన్న విజయ్‌ ఇప్పుడు క్యారెక్టర్‌ రోల్స్‌ చేయటం కరెక్ట్ కాదని ఆ ఆఫర్ సున్నితంగా తిరస్కరించినట్టుగా సమాచారం. దీంతో ఆ పాత్రలో వేరే నటుడ్ని వెతికే పనిలో యూనిట్ పడిందట. ప్రస్తుతం డియర్‌ కామ్రేడ్ షూటింగ్‌లో బిజీగా ఉన్న విజయ్‌ దేవరకొండ తాజాగా పూరీ కదా ఓకే చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి, కానీ దానికి అధికారిక ప్రకటన అయితే రాలేదు

More Related Stories