English   

నితిన్ కి రకుల్ ఓకే చెప్పెసిందా ?

Rakul
2018-12-27 17:51:35

చాలా కాలాం ఫ్లాపులతో సావాసం చేసిన నితిన్ ఇష్క్ దెబ్బకు కుదుట పడ్డాడు. ఆ తర్వాత మరికొన్ని హిట్స్ కొట్టి గాడిలో పడ్డాడు అనుకోగానే మళ్ళీ కొంతకాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్న నితిన్ 'ఛలో' వంటి ప్రేమకథతో హిట్ కొట్టిన వెంకీ కుడుములతో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. రష్మిక కథానాయికగా నటించనున్న ఈ సినిమా, వచ్చేనెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమాతో పాటు చంద్రశేఖర్ యేలేటితోను ఒక సినిమా చేయడానికి నితిన్ ఓకే చెప్పాడట. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం రకుల్ ను సంప్రదించగా, ఆమె వెంటనే ఓకే చెప్పెసిందని సమాచారం. చాలా కాలంగా రకుల్ తెలుగులో స్టార్ హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తూ వస్తోంది. మహేష్ బాబు సినిమా 'స్పైడర్' వేసిన దెబ్బకి తెలుగు సినిమాలు సైన్ చేయడం మానేసి తమిళం, హిందీ పై ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. అయితే కొత్త కథానాయికల పోటీ కారణంగా ఆమెను తెలుగు నుండీ పలకరించే వారే కరువయ్యారట, రాక రాక వచ్చిన అవకాసం కావడంతో రకుల్ వెంటనే ఈ సినిమాను అంగీకరించిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే రకుల్ మరో తెలుగు సినిమా 'వెంకీ మామ' లో కూడా నటించేందుకు చాలా నెలల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెంకటేష్ - నాగచైతన్య కాంబినేషన్ లో బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ సినిమాలో చైతుకు జోడీగా రకుల్ నటిస్తుందట. అదెప్పుడు స్టార్ట్ అవుతుందో క్లారిటీ లేదు కాబట్టి, వచ్చిన అవకాశాలని పోగొట్టుకోకుండా ఓకే చేసేసిందట. అయితే గతేడాది నితిన్, శర్వానంద్ లతో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక మల్టీస్టారర్ ప్లాన్ చేశారు. ఇద్దరు హీరోలకి జోడిగా ఒకరు సాయి పల్లవి కాగా, మరొకరు రకుల్ ప్రీత్ సింగ్. కానీ ఏమైందో కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు.

More Related Stories