English   

మళ్ళీ కెమెరా ముందుకు రేణు దేశాయ్...కానీ !

renu desai acts in ad film for the first time
2018-12-27 15:06:33

రేణు దేశాయ్ మరాఠీ నుండి దిగుమతి అయిన ఈమె పవన్ సరసన బద్రీ సినిమాతో తెరంగేట్రం చేసింది. అయినా తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్‌తో సహజీవనం పెళ్లి కారణంగా ఆమె తెలుగు వారందరికీ ఫేమస్ అయిపోయారు. అయితే ఇద్దరు పిల్లలు పుట్టాక పవన్ నుండి విడాకులు తీసుకున్న రేణు, తాజాగా సోషల్ మీడియాలో చేసిన కొన్ని పోస్ట్ లు వివాదంగా మారాయి. మరో వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నానంటూ కొంత కాలం క్రితం సోషల్ మీడియా ద్వారా ప్రకటించడంతో పవన్ ఫ్యాన్స్ ఆమెను ఇబ్బంది పెట్టడం, తిట్టడం లాంటివి చేశారు. అయితే తాజాగా ఆమె బ్రాండ్ అంబాసిడర్‌ అవతారం ఎత్తినట్టు సమాచారం. కాంచీపురం వరమహాలక్ష్మీ సిల్క్స్ ప్రకటనలో రేణు దేశాయ్ నటించినట్టు ఫిలిం నగర్ టాక్. ఈ యాడ్ షూటింగ్‌ను చెన్నైలో నిర్వహించారని కళామందిర్ కళ్యాణ్ ఈ యాడ్‌ కు దర్శకత్వం చేశారని టాక్. షూటింగ్ సెట్స్ నుంచి లీకైందని చెబుతున్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. అయితే ఈ యాడ్‌ కి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడితే గానీ రేణు దేశాయ్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారారన్న ప్రచారాన్ని పూర్తిగా నమ్మలేం. అయితే కేవలం యాడ్స్ మాత్రమేనా లేదా సినిమాల్లోకి నటిగా మళ్ళీ రీ-ఎంట్రీ ఇస్తుందా అనేది వేచి చూడాలి. 

More Related Stories