English   

విన‌య విధేయ రామ కాదు.. విన‌య విధ్వంస రామ‌..

Ram Charan's Movie Vinaya Vidheya Rama Trailer Talk
2018-12-28 08:25:15

ఇప్పుడు ఈ చిత్ర ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత అభిమానులు ఇదే అంటున్నారు. బోయపాటి సినిమా అంటే ఎలా ఉంటుంది.. ఇప్పటికే ఈయన సినిమాలపై ఓ క్లారిటీ ఉంది ప్రేక్షకులకు. ఇంకా క్లారిటీ కావాలంటే ఇప్పుడు విడుదలైన విన‌య విధేయ రామ‌ ట్రైలర్ చూపిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన బోయపాటి సినిమాలు వేరు.. ఇప్పుడు రామ్ చరణ్ తో చేసిన సినిమా వేరు. సాధారణంగా ట్రైలర్ విడుదల అయిన‌పుడు అందులో అన్ని రకాల ఎమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు అభిమానులు. కానీ బోయపాటి మాత్రం కేవలం రౌద్ర ర‌సం మాత్రమే తీసుకున్నాడు. ఒక‌టి రెండు షాట్స్ అంటే ఏమో అనుకోవచ్చు కానీ ట్రైలర్ అంత మాస్ మాస్ మాస్ అంటూ అంతా అదే నింపేసాడు ఈ దర్శకుడు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు ఫైట్ సీక్వెన్స్ తో స్క్రీన్ దద్దరిల్లిపోయింది. ముఖ్యంగా చరణ్ ను ఈ ద‌ర్శ‌కుడు చూపించిన తీరు అభిమానులకు విందు భోజనమే.
ఇప్పటి వరకు చాలా సినిమాలు చేశాడు కానీ ఈ స్థాయిలో మాత్రం ఎప్పుడూ రెచ్చిపోలేదు మెగా వార‌సుడు. టైటిల్ చూస్తే సాఫ్ట్ గా ఉంది లోపల మాత్రం చాలా సీరియస్ గా ఉంది. పైగా డైలాగులు కూడా అలాగే ఉన్నాయి. అది చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ వచ్చేసింది. కచ్చితంగా అదే మైండులో పెట్టుకుని సినిమాకు రండి అంటున్నాడు బోయపాటి. ట్రైలర్ తోనే ర‌చ్చ చేసాడు ఈ ద‌ర్శ‌కుడు.. మ‌రిరేపు సంక్రాంతికి సినిమా వచ్చిన అసలు ఎలా ఉండ‌బోతుందో సీన్..? నరకడం మొదలుపెడితే నిజంగానే ఈ ముక్క ఎవరితో తెలుసుకోవడానికి వారం కాదు నెల పట్టేలా ఉంది ఇప్పుడు. అంత గా మారిపోయాడు రామ్ చరణ్. బోయపాటి అయితే తన గత సినిమాల కంటే ఇందులో యాక్షన్ పార్ట్ ఇంకా ఎక్కువగా పెట్టాడు. ఇదంతా చూస్తుంటే యావరేజ్ రొటీన్ అని విమర్శలు వస్తున్నా కూడా వర్కవుట్ అయితే మాత్రం బాక్సాఫీస్ దగ్గర సంచ‌ల‌నాలు ఖాయం.

More Related Stories