English   

విన‌య విధేయ రాముడి సాక్షిగా జ‌న‌సేన‌కు చ‌ర‌ణ్ ప్ర‌చారం..

Ram charan speech at vinaya vidheya rama movie pre release event
2018-12-28 01:33:50

ఇప్పుడిక జ్యూస్ లు గ‌ట్రా ఎవరూ తాగరు కదా.. అంతా తాగేది టీయే కదా.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు రామ్ చరణ్. ఈ మధ్య అందరూ ఫ్రూట్ జ్యూస్ ల‌ కంటే ఎక్కువగా ఛాయ్ గ్లాస్ పట్టుకుంటున్నారని చెప్పాడు రామ్ చరణ్. దీనికి కారణం ఇప్పటికే మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా అర్థమైపోయి ఉంటుంది. తన బాబాయ్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి టీ గ్లాస్ గుర్తు వచ్చింది. అందుకే ఇప్పుడు తన వంతుగా జనసేనకు ప్రచారం చేస్తున్నాడు. ప్రపంచం చూస్తుండగానే అభిమానుల సాక్షిగా బాబాయ్ కి ఆల్ ద బెస్ట్ చెప్పాడు రామ్ చ‌ర‌ణ్. వినయ విధేయ రామ‌ ప్రీ రిలీజ్ వేడుకలో రామ్ చరణ్ స్పీచ్ అదుర్స్ అనిపించింది. అందులో బాబాయ్ గెలవాలని కోరుకున్నాడు చరణ్.
ఆయన వెంట నడుస్తున్నందుకు అభిమానులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు ఈ హీరో. అక్కడ పవన్ కళ్యాణ్ లేకపోయినా కూడా అభిమానులు పవన్ పవన్ అంటూ గోల చేశారు. ఈ జోరు చూసి చరణ్ కూడా బాబాయ్ కి సపోర్ట్ చేశాడు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా బాబాయ్ ప్రభావం ఉంటుందని చెప్పకనే చెప్పాడు ఈ మెగా వారసుడు. అందుకే తన వంతుగా ప్రచారం చేస్తున్నాడు మెగా వార‌సుడు. దానికి తన సినిమా ప్రీ రిలీజ్ వేడుకను వాడుకున్నాడు రామ్ చ‌ర‌ణ్. కేటీఆర్ సమక్షంలోనే జనసేనను ఆకాశానికి ఎత్తేసాడు ఈ హీరో. ఆ సందర్భంగానే ఈ మధ్య అంతా టీ గ్లాసులతో కనిపిస్తున్నారు.. కానీ జ్యూసులతో కాదు అంటూ ప్ర‌చారం మొద‌లుపెట్టాడు అబ్బాయి. మరి ఈ అబ్బాయి నమ్మకాన్ని బాబాయ్ ఎంతవరకు నిలబడతాడో చూడాలి.

More Related Stories