English   

చిరంజీవి ఓ సంచ‌ల‌నం.. కేటీఆర్ అద్భుత‌మైన స్పీచ్..

trs working president ktr speak about mega star Chiranjeevi at vvr pre release event
2018-12-28 01:52:32

ఎందుకో తెలియదు కానీ మెగా ఫ్యామిలీకి కేటీఆర్ బాగా కనెక్ట్ అయిపోయాడు. రామ్ చరణ్ కి ఈయ‌న‌ బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు. ఇక చిరంజీవితో కూడా ముందు నుంచి కేటీఆర్ కు మంచి అనుబంధం ఉంది. ఆయ‌న అంటే చాలా ఇష్టం కూడా ఈ లీడ‌ర్ కు. చిరంజీవి అంటే త‌న‌కు చాలా గౌరవం అంటూ చెప్పాడు కేటీఆర్. ఆయన సినిమాలు చిన్నప్పటి నుంచీ చూస్తూనే ఉన్నాన‌ని చెప్పాడు కేటీఆర్. తనతో పాటు చెల్లి కవిత కూడా చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అని చెప్పాడు ఈ డైన‌మిక్ లీడర్. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా వేడుకకు వ‌చ్చిన కేటీఆర్.. చిరంజీవిని ఆకాశానికి ఎత్తేశాడు. తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు భారతీయ చిత్ర పరిశ్రమలోనే చిరంజీవి తనకంటూ ఒక పేజీని రాసుకున్నారని.. ఆయన ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని చెప్పాడు కేటీఆర్. అప్పట్లో రాజకీయాల్లో కూడా తామిద్దరం కలిసి పని చేసామ‌ని గుర్తుచేసుకున్నాడు పొలిటికల్ లీడర్. వినయ విధేయ రామ‌ ప్రీ రిలీజ్ వేడుకలో కేటీఆర్ మాటలు మెగా అభిమానుల్లో జోష్ నింపేసాయి. ముఖ్యంగా ఆయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినప్పుడు అభిమానుల విజిల్స్ తో స్టేడియం హోరెత్తిపోయింది. కచ్చితంగా ఆయన గెలవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు కేటీఆర్. మరి ఈయన చెప్పినట్లే పవన్ కళ్యాణ్ ప్రభంజనం సృష్టిస్తాడో లేదో చూడాలి.

More Related Stories