English   

కేటీఆర్ విన‌య విధేయ రాముడు కాడు.. చిరంజీవి సంచ‌ల‌నం..

Chiranjeevi Praises trs working president KTR in Vinaya Vidheya Rama movie Pre Release Event,chiranjeevi speak about ktr's political Life
2018-12-28 01:58:35

చిరంజీవి రాజకీయాలకు దూరమైపోయాడు అని అనుకున్నారు కానీ ఆయనలో ఇంకా ఆ పాత రాజకీయ నాయకుడు అలాగే ఉన్నాడు. ఆయ‌న అప్పుడ‌ప్పుడూ స‌మ‌యం వ‌చ్చిన‌పుడు బ‌య‌టికి వ‌స్తుంటాడు. ఇప్పుడు తనయుడు ప్రీ రిలీజ్ వేడుకలో ఆ అపరిచితుడు బయటికి వచ్చాడు. పక్కనే కేటీఆర్ ను చూడగానే చిరంజీవికి రాజకీయాలు గుర్తుకు వచ్చాయి. ఒకప్పుడు ఇద్దరు బెంచ్ మేట్స్ అని చెప్పాడు చిరంజీవి. అప్పట్లో ఇద్దరూ అసెంబ్లీలో కలిసి ఉన్న మూమెంట్స్ ను గుర్తుచేసుకున్నాడు మెగాస్టార్. ఇక ఇప్పుడు ఇలా త‌న‌యుడి ప్రీ రిలీజ్ వేడుక‌కు కేటీఆర్ రావడంతో చిరంజీవి ఆనందించాడు.. వ‌చ్చినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపాడు చిరంజీవి. కేటీఆర్ డైనమిక్ లీడర్ అని కొనియాడాడు మెగాస్టార్.
తెలంగాణ అభివృద్ధిలో కేటీఆర్ పాత్ర చాలా ఉందని.. అతను మడమతిప్పని నాయకుడు అంటూ పొగిడేసాడు చిరంజీవి. తండ్రికి తగ్గ తనయుడని.. కేటీఆర్ ఇలాంటి విజ‌యాలు ఇంకా అందుకోవాల‌ని ఆశిస్తున్న‌ట్లు చెప్పాడు మెగాస్టార్. ఇప్పుడు సినిమాకు పెట్టిన విన‌య విధేయ రామ టైటిల్ కేటీఆర్ కు సరిగ్గా సరిపోతుందని ముందు తాను అనుకున్నాను కానీ కాద‌ని చెప్పాడు చిరు. కేటీఆర్ తన మాటల దాడితో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తాడ‌ని.. అలా మాట్లాడ‌టం అంత ఈజీ కాద‌ని.. మాట‌ల దాడి చేయడం అందరికీ సాధ్యం కాదని చెప్పాడు చిరంజీవి. అలా అని కేటీఆర్ విమర్శలు కాదు అన్నీ సద్విమర్శలు చేశారని గుర్తు చేశారు మెగాస్టార్. మొత్తానికి కేటీఆర్ గురించి చిరంజీవి మాట్లాడినంత‌సేపు స్టేడియం అంతా హోరెత్తిపోతుంది.

More Related Stories