English   

శర్వానంద్ దళపతి...కుదిరేట్టు లేదుగా ?

dalapathi is not title for sharwanandh's movie
2018-12-28 02:58:53

సుధీర్ వర్మ, శర్వానంద్ లాంటి క్రేజీ కాంబినేషన్ లో గతేడాది ఒక సినిమా స్టార్ట్ అయ్యింది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించిన ఒక్క అప్ డేట్ కూడా లేదు. ఏడాది దాటిపోయినా దాని ఊసే లేదు. అయితే తాజాగా శర్వానంద్ 'పడి పడి లేచె మనసు' థియేటర్లకు వచ్చింది. ఈ సినిమా విడుదల సమయంలో ప్రమోషన్స్లో సుధీర్ వర్మ సినిమాను గురించి శర్వానంద్ ప్రస్తావించాడు. ఈ సినిమా ఆల్రెడీ 50 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తిచేశారట, అయితే ఇంతవరకూ ఈ సినిమాకి టైటిల్ ఖరారు కాలేదు. అయితే ఈ సినిమాలో శర్వానంద్ మాఫియా డాన్ పాత్ర చేయడం వలన, 'దళపతి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి. రజినీకాంత్ సినిమా టైటిల్ తో వస్తే సినిమా పైన అంచనాలు పెరుగుతాయని, డాన్ క‌థాంశానికి త‌గ్గ‌ట్టుగానే ద‌ర్శ‌క‌నిర్మాత‌లు దళపతి అనుకున్నా ఆ టైటిల్ ను వేరే నిర్మాత రిజిష్టర్ చేయించుకుని ఉండటం వలన, అనవసర వివాదాలు ఎందుకని 'నాయకుడు' అనే టైటిల్ ను చిత్ర యూనిట్ పరిశీలిస్తోందట. అయితే ఈ టైటిల్ వలన ప్రేక్షకుల అంచనాలు మరింత పెరిగే ప్రమాదముందని వారు మళ్ళీ వెనకడుగు వేస్తున్నారట. అయితే ముందు నుండీ ఈ సినిమాలో శర్వా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టుగా ప్రచారం జరిగింది, కానీ ఒకే పాత్రలో రెండు డిఫరెంట్ షేడ్స్ మాత్రం ఉంటాయని శర్వా చెప్పుకొచ్చాడు. మరో లాంగ్ షెడ్యూల్ తో షూట్ బాలెన్స్ ఉన్న ఈ సినిమా సినిమాలో శర్వానంద్ జోడీగా కల్యాణి ప్రియదర్శన్ నటిస్తోంది. అయితే సినిమా మొదలయ్యి ఏడాది దాటేయడంతో త్వరలోనే శర్వా ఇమేజ్ కు తగ్గట్టుగా సినిమా టైటిల్ ను ఓకే చేసి, ఫస్టులుక్ ను విడుదల చేసేలా చూస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More Related Stories