English   

ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ట్రైలర్ టాక్ : రోబో పీఎం !

the accidental prime minister trailer talk
2018-12-28 10:07:02

బాలీవుడ్‌లో బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. అయితే ఇప్పటి వరకు వచ్చిన బయోపిక్స్‌ అన్నీ క్రీడాకారులకి సంబందించినవే రాగా ఆవన్నీ దాదాపు హిట్ అయ్యాయి. అయితే ఆ కోవలోనే ఇప్పుడు మరో బయోపిక్ విడుదలకి సిద్దమయ్యింది. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా, ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే సినిమా రూపొందుతుంది. వాస్తవానికి మన్మోహన్‌సింగ్ దేశానికి ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన మీద అనేక జోకులు పేలుతుండేవి, ముఖ్యంగా ఆయనని ఒక హ్యూమన్ రోబో అంటూ తెగ కేళి చేసేవారు నెటిజన్లు. వాస్తవానికి ప్రధాని కాకముందు ఓ గొప్ప ఆర్థికవేత్తగా ఆయనకు పేరుంది. కానీ కాంగ్రెస్ మాత్రం తన రాజకీయ ల కోసం అంతటి ఆర్ధిక మేధావిని ఓ రోబో పీఎంగా మార్చేసింది. ఆయన ప్రధానిగా ఉన్న పదేళ్లలో తెర వెనుక జరిగిన పరిణామాలను ఆ కాలంలో మన్మోహన్ మీడియా అడ్వైజర్‌గా ఉన్న సంజయ్ బారు అనే జర్నలిస్ట్ పుస్తకం రూపంలో విడుదల చేశారు. ఇప్పుడదే పుస్తకం ఆధారంగా ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ మూవీ తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. మన్మోహన్‌ ను భారతంలోని భీష్మునితో పోలుస్తూ ఆయనలో చెడేమీ లేదు కానీ, ఫ్యామిలీ డ్రామా బాధితుల్లో ఆయన కూడా ఒకరు అని ఒక వ్యక్తి అంటే, మహాభారతంలో రెండు ఫ్యామిలీలున్నాయి ఇండియాలో ఒకటే ఫ్యామిలీ అంటూ అక్షయ్ ఖన్నా చెప్పే డైలాగ్‌తో స్టార్ట్ అయిన ఈ ట్రైలర్ అంతా ఆసక్తిని రేపుతోంది. సోనియా గాంధీ ప్రధానిగా మన్మోహన్ పేరు సూచించడం, ప్రధానిగా మన్మోహన్ ప్రమాణ స్వీకారం చెయ్యడం, ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు జరిగిన పరిణామాలు, రాజకీయాల నేపథ్యంలో రూపొందించిన ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఓ రోబో లాగా మన్మోహన్‌ సింగ్‌ను కాంగ్రెస్ ఎలా వాడుకుంది, ఆయన పీఎంగా ఉన్న సమయంలో ఎన్ని జరిగిన ఎన్నో స్కాంలకు సంబందించిన వివాదాస్పద అంశాలను ఈ ట్రైలర్‌లో చూపించారు. పార్టీకి, దేశానికి మధ్య నలిగిపోతున్న క్యారెక్టర్‌గా మన్మోహన్‌ను చూపించడం గమనార్హం. ఇందులో మన్మోహన్ పాత్రలో అనుపమ్ ఖేర్ నటించగా సంజయ్ బారుగా అక్షయ్ ఖన్నా నటించాడు. అచ్చూ మన్మోహన్‌సింగ్‌లా కనిపిస్తున్న అనుపమ్ ఖేర్ ఆయన నడక, మాటతీరును మక్కీకిమక్కీ అనుకరించడానికి ప్రయత్నించాడు. మన్మోహన్‌ కు, కాంగ్రెస్‌ కు మధ్య కలహానికి కారణమయిన న్యూక్లియర్ డీల్, కశ్మీర్ అంశాలను కూడా ఈ ట్రైలర్‌లో ముఖ్యంగా చూపించారు. విజయ్ గుట్టె దర్శకత్వం వహించిన ఈ మూవీలో సోనియా గాంధీగా జర్మన్ యాక్టర్ సుజానె బెర్నెర్ట్ కనిపించగా రాహుల్‌గాంధీగా అర్జున్ మాథుర్, ప్రియాంకా గాంధీగా అహనా కుమ్రా నటించారు. 2019 జనవరి 11న ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ మూవీ రిలీజ్ కానుంది.

More Related Stories