English   

ధరమ్ తేజ్ కోసం త్యాగం చేసిన బన్నీ !

Allu Arjun’s next film  with Trivikram Srinivas almost confirmed
2018-12-28 03:48:21

ప్రస్తుతం మెగా హీరోల్లో అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ ల టైం అస్సలు బాలేదు, ధరమ్ తేజ్ అయితే ఇప్పటికే అరడజను ఫ్లాపులు ఇచ్చి డీలా పడిపోయాడు. ఇప్పుడు హిట్ కొట్టకపోతే ఈ ధరం తేజ్ అంటే ఎవరబ్బా ? అని జనం ఆదిగినా అడుగుతారు. కానీ అల్లు అర్జున్ పరిస్థితి అది కాదు ఆయనకి ఒకటి రెండు పరాజయాలు ఎదురైనా ఆయన ఎస్టాబ్లిష్ద్ స్టార్ కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు. మరోపక్క బన్నీ కోసం త్రివిక్రమ్ ఒక కథను, గీత గోవిందం పరశురామ్ మరో కథను రెడీ చేసి పెట్టారు. ఈ నేపధ్యంలో హిట్ తనకంటే సాయిధరమ్ తేజ్ కి ఎక్కువ అవసరం అని భావించిన బన్నీ, తన కోసం సిద్దం చేసిన సినిమాను సాయిధరమ్ తేజ్ తో చేయమని పరశురామ్ తో చెప్పాడట అల్లువారబ్బాయి. తాను మాత్రం ముందుగా అనుకున్నట్టే త్రివిక్రమ్ తో కలిసి సినిమా మొదలు పెడతాడు. బన్నీ కోసం పరశురామ్ తయారు చేసుకున్న కధతో ధరమ్ హిట్ కొడితే బన్నీ చేసిన త్యాగానికి ఫలితం లభించినట్టే.

More Related Stories