English   

ఈ సంక్రాంతి స‌మ‌రం.. ఎవ‌రికోసం..?

sankranti 2019  release movies
2018-12-28 12:01:21

ఇప్పుడు బ‌య్య‌ర్లు అడుగుతున్న ప్ర‌శ్న ఇదే. సంక్రాంతికి ఒకేసారి ఇన్ని సినిమాలు వస్తే ఎవరికి నష్టం.. ఎవరికి లాభం..? ఒకటి రెండు అంటే ఏమో అనుకోవచ్చు కానీ ఈ సంక్రాంతికి ఏకంగా నాలుగు భారీ సినిమాలు వస్తున్నాయి. వేటికవే ప్రత్యేకం. అన్ని సినిమాల్లోనూ స్టార్స్ ఉన్నారు. దాంతో ఏ సినిమాను తక్కువగా అంచనా వేయడానికి లేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ బయోపిక్, రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమాల‌పై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. వీటికి తోడు ఎఫ్ 2, రజినీకాంత్ పేట సినిమాలు కూడా పండక్కి రానున్నాయి. ఇలా అన్ని ఒకేసారి వ‌స్తుండ‌టంతో ప్రేక్షకులు పండగ చేసుకుంటున్నారు.. కానీ బ‌య్య‌ర్లు మాత్రం వణికిపోతున్నారు. ఇన్ని సినిమాలు ఒకేసారి వస్తే కచ్చితంగా తమకు నష్టం త‌ప్ప‌ద‌ని వ‌ణికిపోతున్నారు డిస్ట్రిబ్యూటర్లు.
పాజిటివ్ టాక్ వస్తే ప‌ర్లేదు గానీ ఏ మాత్రం నెగిటివ్ టాక్ వ‌చ్చినా కూడా మిగిలిన సినిమాలు ఫ‌స‌క్ అంటున్నారు వాళ్లు. 2017లో సంక్రాంతికి వ‌చ్చిన ఖైదీ నెంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి, శతమానం భవతి విజయం సాధించాయి. దాంతో 2019 సంక్రాంతి కూడా ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నారు నిర్మాతలు. వాళ్ల నమ్మకం ఎంతవరకు నిలబడుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ప్రతి సినిమా బిజినెస్ కనీసం భారీగానే జ‌రుగుతుంది. ఎన్టీఆర్ బయోపిక్ 60 కోట్ల వరకు బిజినెస్ చేస్తుంటే.. రామ్ చ‌రణ్ వాటా 90 కోట్లు ఉంది. ఇక ఎఫ్ 2 సినిమా కూడా దాదాపు 30 కోట్ల బిజినెస్ చేస్తుంది. ఇవన్నీ ఇలా ఉంటే రజనీకాంత్ పేట సైతం 13 కోట్లు బిజినెస్ చేసింది. మొత్తానికి 2019 సంక్రాంతి దాదాపు 200 కోట్ల బిజినెస్ సాక్ష్యంగా నిలువనుంది. మరి ఇందులో ఏ సినిమా విజేతగా నిలుస్తుందని త్వరలోనే తేలనుంది

More Related Stories