English   

పేట ట్రైల‌ర్‌ టాక్ : విజిల్సే !

Rajinikanth's Petta Movie trailer talk
2018-12-28 05:06:19

‘జిగర్ తండా’, ‘పిజ్జా’ లాంటి సెన్సేషనల్ హిట్ లు అందించిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్  దర్శకత్వంలో రజనీకాంత్ కధానాయకుడు పేట సినిమా విడుదలకి సిద్దమయ్యింది. సిమ్రాన్, త్రిషలు కథానాయికలుగా నటించిన ఈ సినిమాను, తమిళ, తెలుగు భాషల్లో జనవరి 10వ తేదీన తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి తమిళ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. రజనీ, సిమ్రాన్, త్రిష, నవాజుద్దీన్ సిద్ధిఖీ, విజయ్ సేతుపతి, బాబీ సింహా, మేఘా ఆకాశ్ ఇలా ప్రధాన పాత్రలన్నింటినీ కవర్ చేస్తూ తాజా ట్రైలర్ ను కట్ చేశారు. యాక్షన్, కామెడీ ప్రధానంగా సాగే సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా వుంది. రజనీని అల్ట్రా స్టైలిష్ గా మరింత యంగ్ కనిపిస్తున్నారు. రజనీ కాంత్‌ హాస్టల్ వార్డెన్‌గా, ఫ్లాష్‌బ్యాక్‌ లో సైనిక అధికారిగా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు ట్రైలర్ ను బట్టి అర్ధం అవుతోంది. ఈ ట్రైలర్ చివరిలో మాస్ లుక్ తో మాస్ బీట్ కి ఆయన వేసిన స్టెప్పులు రజనీలో ఎక్కడా స్పీడ్ తగ్గలేదని స్పష్టం చేస్తున్నాయి. రజనీ సినిమా నుంచి అభిమానులు ఆశించే జోష్ ఈ సినిమాలో పుష్కలంగా ఉందనే విషయం ఈ ట్రైలర్ ను బట్టి అర్థమైపోతోంది. అనిరుధ్ ర‌విచంద్రన్ చిత్రానికి సంగీతం అందించ‌నున్నారు. విజ‌య్ సేతుప‌తి, బాబీ సింహా, మేఘా ఆకాశ్‌, న‌వాజుద్దీన్ సిద్ధిఖీ చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషించారు.

More Related Stories