English   

కాకినాడను మిస్సవుతున్నాడట !

Vijay-Devarakonda
2018-12-28 10:59:42

'టాక్సీవాలా' సినిమా తర్వాత హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా 'డియర్ కామ్రేడ్' నిర్మితమవుతోంది. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా  మేజర్ షెడ్యూల్ ను కాకినాడలో ప్లాన్ చేశారు. కొన్ని రోజులుగా అక్కడ చిత్రీకరణ చేస్తూ వస్తున్నారు. ఈ సినిమాలో మరోమారు విజయ్ దేవరకొండ మెడికల్ స్టూడెంట్ పాత్రలో కనిపించనున్నాడు. అందువలన కాకినాడ కాలేజ్ లోను ఆ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తూ వచ్చారు. తాజాగా అక్కడి షెడ్యూల్ ను పూర్తి చేశారు. విజయ్ దేవరకొండ, రష్మిక కాంబినేషన్లో చిత్రీకరించిన సీన్స్ చాలా బాగా వచ్చాయట. 

తాజాగా ఈ షెడ్యూల్ ముగియడంతో సినిమా టీమ్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ నేపధ్యంలో విజయ్ మాట్లాడుతూ  ఇక్కడ ఇన్ని రోజులుగా నాతో పాటు కలిసి వున్న స్నేహితులు, ఇప్పుడు ఇక్కడి నుంచి నేను వెళ్లిపోతున్నాననగానే ఎమోషనల్ అయ్యారని, కన్నీళ్లతో వెళ్లిపోయారని, తను కూడా కాకినాడను ఇక్కడి వాళ్లను చాలా మిస్సవుతున్నానని చెప్పుకొచ్చాడు. ఫోన్ పక్కన పెట్టేసి ఇక్కడి సముద్రాన్ని చూస్తూ ఎంజాయ్ చేశానని, ఇక్కడి స్టూడెంట్స్ చాలామంది సినిమాలో కనిపిస్తారని దర్శకుడు కమ్మ కాకినాడలో పుట్టి పెరగడం వలన, ఈ ప్రదేశాన్ని దృష్టిలో పెట్టుకుని కథ రాశాడని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాను మే నెల రెండవ వారంలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. 

More Related Stories