English   

కార్తికేయ కోసం క్యూ కట్టిన టాలీవుడ్ హీరోలు 

NTR-Ram-Charan
2018-12-28 11:16:01

టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి ఇంట పెళ్లి సందడి మొదలైంది. రాజమౌళి కొడుకు కార్తికేయతో జగపతిబాబు అన్న కూతురు పూజా వివాహం డిసెంబర్ 30న జైపూర్‌ లో జరగనుంది. ఈ సందర్భంగా రాజమౌళి కుటుంబం ఇప్పటికే జైపూర్‌ కు చేరుకుంది. దీంతో టాలీవుడ్ సెలబ్రిటీలు ఛలో జైపూర్ అంటు ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. ఇప్పటికే జైపూర్ కు పయనమైన రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు ఈరోజు శంషాబాద్ విమానశ్రయంలో కెమెరాలకు చిక్కారు. ఎయిర్ పోర్ట్ లో తీసిన ఫోటోలో తారక్ కుమారుడు అభయ్ రామ్ ను చరణ్ చేయి పట్టు కొని నడిపిస్తుండడం విశేషం. వీరే కాక రానా, నానిలు కూడా జైపూర్ లో ల్యాండ్ అయ్యారు. వీరే కాక రాజమౌళికి సన్నిహితంగా ఉండే చాలామంది సెలబ్రిటీలు జైపూర్ కు పయనమవుతున్నారు. జైపూర్ లో రాజుల భవనం స్టైల్లో ఉండే హోటల్ ఫెయిర్ మాంట్ లో ఈ వివాహం జరగనుంది.  మూడు రోజుల పాటు పెళ్లి వేడుక జరగనుంది. ఇవాళ వెల్‌కమ్ డిన్నర్‌తో మొదలై డిసెంబర్ 29న మెహెంది, సంగీత్, డిసెంబర్ 30న వివాహం జరగనున్నట్లు తెలిసింది.  

More Related Stories