English   

ప్రభాస్ లిస్టు లో చేరిన 'కేజీఎఫ్' దర్శకుడు

KGF-Yash
2018-12-28 18:30:47

ఒకప్పుడు సినిమా హిట్ అయ్యిందని చెప్పుకోవాలి అంటే వంద రోజులో, నూట యాభై రోజులో ఆడితే అప్పుడు హిట్ అనుకునేవాళ్లు. కానీ ట్రెండ్ మారింది ఇప్పటి ట్రెండ్ ప్రకారం అత్యధిక థియేటర్ లలో విడుదలయ్యి, కోట్లకు కోట్లు కలెక్షన్లు కొల్లగోడితేనే హిట్టన్న మాట. అలాగే అలా ఒక సినిమా హిట్ కొడితే అందులో నటీనటుల్ని, డైరెక్టర్ ని పొగిడే పనిలో బిజీ అయిపోతున్నారు నేటి సినీ జనం. తాజాగా   కన్నడ చిత్రం కేజీఎఫ్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవటంతో అందరి దృష్టీ ఆ సినిమా హీరో యష్ మీదా దర్శకుడు ప్రశాంత్ నీల్ మీదా పడింది. కన్నడ చిత్రసిమ చరిత్రలోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కేజీఎఫ్ మూవీ గత శుక్రవారం నాడు రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది. విచిత్రం ఏంటంటే కన్నడ సినిమాలు తెలుగులో డబ్ చేసి రిలీజ్ అవడం చాలా అరుదు. అయితే యష్ సినిమా మాత్రం దుమ్మురేపుతోంది. ఈ సినిమాతో పాటే రిలీజ్ అయిన తెలుగు సినిమాలని ఎవరూ పట్టించుకోవటం లేదు. దాంతో ఫిల్మ్ సర్కిల్స్ లో  ఎక్కడ చూసినా కేజీఎఫ్ గురించే చర్చించుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. దాంతో ఆ డైరక్టర్ తో సినిమా చెయ్యటానికి మన హీరోలు ఉత్సాహం చూపిస్తున్నారట, అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ సైతం ఈ డైరక్టర్ తో ఒక సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యాడట. దాంతో యువి క్రియేషన్స్ రంగంలోకి దిగి ఆ డైరక్టర్ ని లాక్ చేసి ప్రభాస్ కు సరిపోయే కథ ఒకటి సిద్ధం చేసుకోమని చెప్పారట యువి క్రియేషన్స్ వారు. ప్రభాస్ ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమా చేస్తున్నాడు, ఆ తర్వాత రాధాకృష్ణ డైరక్షన్ లో కూడా మూవీ ఉంది. మరి ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.

More Related Stories