English   

స్పానిష్ రీమేక్ లో హీరోగా అడివి శేష్

Adivi Sesh Signs One More Remake Movie
2018-12-29 01:20:37

కర్మ చిత్రంతో దర్శకుడిగా, నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయిన అడవిశేష్ , ఆ తర్వాత పంజా చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తారవాత ‘బలుపు’, ‘రన్‌ రాజా రన్’ ‘బాహుబలి ‘ వంటి చిత్రాలతో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ తనకంటూ అభిమానులను సొంతం చేసుకున్న శేష్. క్షణం, గూఢచారి లాంటి విభిన్నమైన చిత్రాలతో హిట్స్ సాధించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ప్రస్తుతం 'టూ స్టేట్స్' రీమేక్ లో చేస్తోన్న ఆయన, ఆ తరువాత 'గూఢచారి 2' చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఈ రెండు సినిమాల మధ్య ఆయన మరో ప్రాజెక్టు చేస్తున్నాడనేది ఫిలిం నగర్ నుండి అందుతున్న సమాచారం. ఒక స్పానిష్ సినిమా రీమేక్ లో ఆయన నటిస్తున్నాడట. 'ది ఇన్విజిబుల్ గెస్ట్' అనే క్రైమ్ థ్రిల్లర్ రీమేక్ లో ఆయన కథానాయకుడిగా చేస్తున్నాడట రాంజీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో అడివి శేష్ సరసన కథానాయికగా లావణ్య త్రిపాఠి నటిస్తోందని ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగును పూర్తి చేసినట్టుగా సమాచారం. మాజీ ప్రియురాలి హత్యకేసులో నిందితుడైన బిజినెస్ మేన్ గా ఇందులో అడివి శేష్ కనిపిస్తాడని అంటున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు సుజయ్ గోష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాప్సీ, అమితాబ్, షారూక్ వంటి స్టార్ క్యాస్టింగ్ తో వచ్చే ఏడాది మార్చ్ లో రిలీజ్ కానుంది.  

 

More Related Stories