English   

రాజకీయాల్లో రామ్ చ‌ర‌ణ్.. జ‌న‌సేన‌లో క్రియాశీల‌కం.. 

Ram-Charan
2018-12-29 02:39:11

రామ్ చరణ్ రాజకీయాలకు వస్తున్నాడా.. ఈయన ఫ్యూచర్ జనసేన కాబోతుందా.. బాబాయ్ కి సపోర్ట్ గా చరణ్ నిలబడుతున్నాడా.. ఏమో ఇప్పుడు చూస్తుంటే అదే అనిపిస్తుంది రామ్ చ‌ర‌ణ్ పూర్తిగా మారిపోయాడు. ఒకప్పుడు రాజకీయాలు అంటే నాకు తెలియదు అని తప్పించుకుని తిరిగే మెగా వారసుడు.. ఇప్పుడు కావాలనే రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు. సందర్భం వచ్చిన ప్రతిసారి బాబాయ్ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తున్నాడు. మొన్న త‌న సినిమా ప్రీ రిలీజ్ లో కూడా చరణ్ మాటలు ఆసక్తి పుట్టించాయి. బాబాయ్ కి ఫుల్ గా సపోర్ట్ చేశాడు ఈ మెగా వారసుడు. ఆ మధ్య వరుణ్ తేజ్ అంతరిక్షం సినిమా వేడుకకు వచ్చిన చరణ్.. పవన్ కళ్యాణ్ ను ఆకాశానికి ఎత్తేశాడు. ఆయ‌న వెంట న‌డుస్తున్న వాళ్లంద‌రికీ ధ‌న్యవాదాలు తెలిపాడు. 

ఆ తర్వాత మళ్లీ తన సినిమా ఫంక్షన్లో కూడా అదే చేశాడు. ఇవన్నీ చూసి కేటీఆర్ కూడా చరణ్ ను కాబోయే రాజకీయ నాయకుడు అంటూ సంభోదించాడు. కానీ వెంటనే మళ్ళీ కాదులే ఇంకా నీకు టైం ఉంది అంటూ సర్ది చెప్పాడు. కేటీఆర్ అన్నాడని కాదుగానీ చరణ్ నిజంగానే ఇప్పుడు రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నాడు. త్వరలోనే అవసరం అనుకుంటే ఈయ‌న జనసేనకు ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఏపీలో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఒంటరిగానే దిగుతున్నాడు ప‌వ‌న్. ఇప్పుడు ఆయనకు సపోర్ట్ గా మెగా హీరోలు నిలబడుతున్నారు. అందులో ముఖ్యంగా చరణ్ జై పవన్ జై పవన్ అంటూ ప్రతి వేడుకలో బాబాయ్ కి సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. మరి ఫ్యూచర్ నిజంగానే జనసేన కాబోతుందేమో చూడాలి.

More Related Stories