English   

థియేట‌ర్స్ అమ్ముకున్న వినాయ‌క్.. ఏం చేస్తున్నాడిప్పుడు..?

V. V. Vinayak  Selling His Assets in Visakhapatnam
2018-12-29 02:42:42

వినాయక్ ఏం చేస్తున్నాడు.. ఇంటెలిజెంట్ సినిమా తర్వాత ఈ ద‌ర్శ‌కుడు ఎందుకు కనిపించడం మానేసాడు. సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడా ఇకపై సినిమాలు చేయడా.. అసలు వినాయ‌క్ ఇండస్ట్రీ లోనే ఉన్నాడా వదిలేసి బయటకు వెళ్ళిపోయాడా..? ఇప్పుడు ఈయన మీద అభిమానులు రాసుకుంటున్న వార్త‌లు.. వస్తున్నమాట‌లు.. సోషల్ మీడియాలో వ‌చ్చిన రూమ‌ర్లు అయితే ఇవే. వినాయక్ గురించి అక్క‌డ రోజు చర్చ జ‌రుగుతూ ఉంటుంది. ఈ దర్శకుడు మళ్ళీ సినిమాలు చేస్తాడా చేయడా అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఈయన మాత్రం  అవన్నీ వింటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు వినాయక్ అభిమానులకు మరో షాకింగ్ న్యూస్ తెలిసింది. విశాఖపట్నంలో ఈయనకు ఉన్న వి మ్యాక్స్ థియేటర్ అమ్మేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈయన సంపాదించిన డబ్బులు అన్నీ మళ్ళీ తిరిగి థియేటర్స్ పైన పెట్టడం వినాయక్ అలవాటు. ఇప్పుడు కూడా అదే చేశాడు. చాలా ఏళ్ల క్రితం కొనుగోలు చేశాడు వినాయ‌క్. అయితే దీన్ని ఇప్పుడు అమ్మేశాడనే వార్తలు వ‌స్తున్నాయి. ఈ మల్టీప్లెక్స్ వ్యవహారాలు వినాయక్ సోదరుడు విజయ్ చూసుకునేవాడు. విశాఖపట్నంలోని హైపర్ మార్కెట్ చెయిన్ వాళ్లు థియేటర్ కాంప్లెక్స్ ను కొనుగోలు చేశారని తెలుస్తోంది. దీనిపై వినాయ‌క్ ఎలాంటి స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు. మరోవైపు ఈయ‌న‌ తర్వాత సినిమా ఏంటి అనే చ‌ర్చ‌లు కూడా ఇప్పుడు ఊపందుకున్నాయి. దీనిపై ఆయన మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వకుండా అలాగే ఉన్నారు. బాలయ్యతో సినిమా కన్ఫర్మ్ చేసిన ఆయన మాత్రం బోయపాటితో సినిమా కన్ఫర్మ్ చేశారు. దాంతో వినాయక్ నెక్స్ట్ ఏంటి అని క్వ‌శ్చ‌న్ ఇంకా వెంటాడుతూనే ఉంది.

More Related Stories