English   

సుమంత్ ఇదం జ‌గ‌త్.. ప‌డిందిగా మ‌రో ఫ్లాప్..

sumanth's idam jagath movie talk
2018-12-29 02:51:54

దెబ్బ.. దెబ్బ మీద దెబ్బ.. ఆ దెబ్బ మీద మరో దెబ్బ.. పాపం ఇలాగే ఉంది ఇప్పుడు సుమంత్ పరిస్థితి. మంచి సినిమాలు చేస్తున్నా కూడా విజయాన్ని అందుకోలేకపోతున్నాడు ఈ అక్కినేని వారసుడు. చాలా ఏళ్ల తర్వాత గత ఏడాది మళ్లీ రావా సినిమాతో ప్రేక్షకులను పలకరించారు సుమంత్. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకున్న కూడా కమర్షియల్ గా మాత్రం విజయం సాధించలేదు. ఇక ఈ ఏడాది సుబ్రమణ్యపురం సినిమాతో వచ్చాడు సుమంత్. ఆ సినిమా ఈయనకు 25వది. దానికి మంచి టాక్ వచ్చినా కూడా అది కూడా కమర్షియల్ గా విజయం సాధించలేదు. ఇప్పుడు ఈయ‌న నటించిన మరో సినిమా విడుదల అయింది. కనీసం ఆ సినిమా విడుదలైనట్లు కూడా ఎవరికీ తెలియదు. అదే ఇదం జగత్.. మీడియా నేపథ్యంలో అనిల్ శ్రీకంఠం తెరకెక్కించిన ఈ సినిమాకు కూడా నెగిటివ్ టాక్ వచ్చింది.
కథ బాగానే ఉన్నా కథనం చాలా నెమ్మదిగా ఉండడంతో ఇదం జగత్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది అంటున్నారు విశ్లేషకులు. ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్న సుమంత్ కు మరోసారి నిరాశ తప్పేలా కనిపించడం లేదు. పైగా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల కురిపిస్తుంది కేజిఎఫ్. ఇలాంటి టైంలో అడ్డుకోవాలంటే కచ్చితంగా అంతకంటే ఎక్కువ విష‌యం ఉన్న సినిమా రావాలి. కానీ సుమంత్ సినిమాలో ప్రేక్షకులకు అది కనిపించలేదు దాంతో మరోసారి వారసుడికి ఫ్లాప్ అనే మాట తప్ప హిట్ అనే మాట వినపడలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ లో ఏఎన్నార్ గా నటిస్తున్నాడు సుమంత్. ఈ చిత్రంతో ఖచ్చితంగా విజయం అందుకుంటానని ధీమాతో ఉన్నాడు ఈ హీరో.

More Related Stories