English   

మ‌న హీరోలు నిజంగానే మోసం చేస్తున్నారా..?

mahesh babu and  prabhas cheating case
2018-12-29 09:59:22

హీరోలు అంటే ఆదర్శంగా ఉండాలి.. వాళ్లను చూసి అభిమానులు కూడా ఆదర్శంగా ఇన్స్పైర్ అవ్వాలి.. కానీ మన హీరోలు నిజంగా అలా ఉంటున్నారా అంటే సమాధానం మాత్రం లేదు అని వస్తుంది. ఇప్పుడు మహేష్ బాబు విషయంలో జరిగిన జీఎస్టీ పన్ను గొడవ ఆయన ఇమేజ్ కు ప్రశ్నార్థకంగా మారింది. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండే మహేష్ బాబుకు సడన్ గా ఇలాంటి నోటీసులు రావడం.. పన్ను కట్టలేదు అంటూ నానా యాగీ చేయడంతో ఆయన అభిమానులు బాగా హార్ట్ అవుతున్నారు. 2007-08 సంవత్సరానికి గాను ఈయన 73 లక్షల పన్ను కట్టలేదని ఆయన బ్యాంకు అకౌంట్లు సీజ్ చేశారు క‌మీష‌న‌ర్. దీనిపై మహేష్ బాబు టీం కూడా స్పందించింది. పదేళ్ల కింద జిఎస్టి అనేది లేనప్పుడు ఎలా కడతాం.. అసలు ఆ చట్టం గురించి మాకు ఎలా ఎలా తెలుసు అంటూ వాళ్ళు కౌంటర్ వేశారు.
అంతే కాదు తాను ఇప్పటి వరకు ఏ పన్ను చెల్లించకుండా ఉండలేదని మహేష్ బాబు క్లారిటీ ఇచ్చాడు. ఇది ఇలా ఉంటే మన హీరోల విషయంలో ఇలా కేసులు పెట్టడం ఈ మధ్య అలవాటుగా మారిపోయింది. మొన్న ప్రభాస్ భూమి విషయంలో కూడా ఇలాంటి గొడవే జరిగింది. ఈయన కూడా తాను అంతా సరిగ్గానే చేశాను నా వైపు నుంచి ఎలాంటి తప్పు లేదు అంటున్నాడు. కానీ ప్రభుత్వం మాత్రం తమ ఆధీనంలో ఉన్న భూమిని ప్ర‌భాస్ ఎలా కొంటాడు అని ప్ర‌శ్నిస్తుంది. మొత్తానికి హీరోలు చేస్తున్న పనులు చూసి అభిమానులు ఎలా పిలవాలో అర్ధం కావట్లేదు. తెలిసి చేస్తున్నారో తెలియదు చేస్తున్నారో తెలియదు కానీ వాళ్లు మాత్రం కేసులో ఇరుక్కోవడం అభిమానులకు బాధ కలిగిస్తుంది.

More Related Stories