English   

సంక్రాంతికి థియేట‌ర్స్ ఎక్క‌డ‌.. నాలుగు సినిమాకు న‌ర‌క‌మే..

SANKRNATI 2019 release movies
2018-12-29 10:12:25

సంక్రాంతి అంటేనే సినిమా పండుగ. ఆ రోజు కచ్చితంగా సినిమా చూసి కానీ ఇంటికి రారు కొంతమంది అభిమానులు. అంత పిచ్చి ఉంటుంది సంక్రాంతికి. ఇప్పుడు ఈ సంక్రాంతి కూడా అలాగే ఉండబోతుంది. ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు పండ‌క్కి రాబోతున్నాయి. ఇప్పుడు ఇదే వణుకు పుట్టిస్తుంది బ‌య్య‌ర్ల‌కు కూడా. నాలుగు సినిమాలు రావడం బాగానే ఉంది కానీ వాటికి థియేటర్లు ఎక్కడ ఉన్నాయి అంటూ ప్రశ్న మొదలైందిప్పుడు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 1600 థియేటర్లలో నాలుగు భారీ సినిమాలకు ఎలా పంచుతారంటూ అనుమానాలు మొదలయ్యాయి. ఈ పండక్కి బాలకృష్ణతో పాటు రామ్ చ‌రణ్, రజినీకాంత్, వెంకటేష్ లాంటి హీరోలు కూడా వస్తున్నారు. మరి వీళ్ళందరికీ ఎన్ని థియేటర్లు ఇస్తారు.. ఒక్కో సినిమాకు ఎన్ని స్క్రీన్ లు పంచుతారు అనేది అర్థం కాక అభిమానులతో పాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా జుట్టు పీక్కుంటున్నారు.
ఇందులో వెంకటేష్ కు సపోర్టుగా దిల్ రాజు, సురేష్ బాబు ఉన్నారు. ఇక రామ్ చరణ్ వెంట అల్లు అరవింద్ ఉన్నాడు. బాలకృష్ణ కు సాయి కొర్రపాటి ఉన్నాడు. ఇలా ఎవరికి వారు సొంతంగా థియేటర్స్ మ్యానేజ్ చేసుకోగలిగిన స్థాయి నిర్మాతలే ఈ సినిమాల‌ను నిర్మించారు. అందుకే అంతా ఒకేసారి దండయాత్రకు సిద్ధమవుతున్నారు. కానీ రజనీకాంత్ పేట సినిమాకు థియేటర్లు ఎన్ని దొరుకుతాయి అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు బాలకృష్ణ కథానాయకుడు సినిమాకు కూడా సరిపోయిన‌న్ని థియేటర్లు వస్తాయా లేదా అనేది అనుమానంగా మారింది. జనవరి 9న ఈ సినిమా విడుదల కానుంది. 10న పేట.. 11న వినయ విధేయ రామ‌.. 12 ఎఫ్ 2 సినిమాలు విడుదల కానున్నాయి. మొత్తానికి ఈ సంక్రాంతికి ఎవ‌రి జాత‌కం ఎలా మార‌బోతుంద‌నేది చూడాలిక‌.

 

More Related Stories