English   

మ‌హేష్ బాబు ప్ర‌భుత్వం బాకీ తీర్చేసాడు.. ప‌న్ను క‌ట్టేసాడు.. 

Mahesh-Babu
2018-12-29 18:19:17

మహేష్ బాబు ఎవరు బాకీ ఉంచుకోడు తిరిగి ఇచ్చేస్తాడు. శ్రీమంతుడు సినిమాలో చెప్పినట్టు తిరిగిచ్చేయాలి అంటే ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశాడు సూపర్ స్టార్. ఈయ‌న‌ చెల్లించలేదని గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో నానా రచ్చ జరుగుతూనే ఉంది. దీనిపై ప్రభుత్వ అధికారులు కూడా బ్యాంకు అకౌంట్లు సీజ్ చేసి టెన్షన్ పెట్టారు. ఆ తర్వాత మహేష్ బాబు కూడా సీన్ లోకి వచ్చి.. తాను ప్రభుత్వాన్ని మోసం చేయలేదని పన్ను ప్రతి ఒక్కటి స్పష్టంగా చెల్లించాలని చెప్పాడు. సూపర్ స్టార్ తరఫు లాయర్ కూడా ఇదే మాట చెప్పాడు.

అయితే అధికారులు మాత్రం మహేష్ బాబు అకౌంట్ లో ఉన్న 43లక్షల సీజ్ చేశారు. 73 లక్షల ప్రభుత్వానికి పన్ను బకాయి పడ్డాడు అంటూ మహేష్ పై ఆరోపణలు చేశారు. దీనికి మహేష్ కాస్త సీరియస్ గానే రియాక్ట్ అయినా కూడా మొత్తానికి పన్ను చెల్లించాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 31 లక్షల 47 వేల 994 నాలుగు రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాడు సూపర్ స్టార్. దీనికి సంబంధించిన చెక్కు బయటకి వచ్చింది. ఏదేమైనా ప్రభుత్వానికి బకాయిపడ్డ పన్ను చెల్లించడంతో మహేష్ కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. కానీ ఆయనపై వచ్చిన ఆరోపణలు మాత్రం ఆయన అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచాయి. వివాదాల జోలికి పోని ఇలాంటి వివాదాల్లోకి లాగడం ఏంటి అని వాళ్లు కోపంతో ఊగిపోతున్నారు. 2007-08 సంవత్స‌రానికి గానూ మ‌హేష్ ప‌న్ను చెల్లించ‌లేద‌ని ఆయ‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌.
 

More Related Stories