English   

బాలయ్య కాదంటే వెంకటేష్ ఔనన్నాడా ?

Balakrishna rejects vv vinayaka script
2018-12-29 19:04:48

ఒకప్పటి టాప్ డైరెక్టర్ వినాయక్ చివరిగా చేసిన 'ఇంటెలిజెంట్' నిరాశపరచడంతో ఇప్పటివరకూ ఇంకో ప్రాజెక్ట్ సెట్ కాలేదు.  దాదాపుగా ఏడాది నుండి బాలయ్యతో సినిమా చేయడానికి వినాయక్ ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమాను నిర్మించేందుకు ఇంటెలిజెంట్ నిర్మించి చేతులు కాల్చుకున్న సి.కళ్యాణ్ ముందుకొచ్చాడు. కానీ బాలయ్యకు కథ నచ్చకపోవడంతో వినాయక్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా బోయాటికి లైన్ క్లియర్ చేశాడు. అయితే తాజాగా విశాఖపట్నంలో ఆయనకున్న ఉన్న వి మ్యాక్స్ థియేటర్ అమ్మేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో వినాయక్ బాలయ్యకు రెడీ చేసిన కధే పట్టుకుని హీరో వెంకటేష్ ను అప్రోచ్ అయ్యాడట. అయితే అదే కథ విషయంలో వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలేక్కనుంది అంటున్నారు. వెంకటేష్ - వినాయక్ కాంబినేషన్లో గతంలో 'లక్ష్మి'(2006) అనే సూపర్ హిట్ సినిమా వచ్చింది. ఇక వెంకటేష్ వరుణ్ తేజ్ నటించిన 'F2' సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత మేనల్లుడు నాగ చైతన్య తో కలిసి 'వెంకీ మామ' సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు గానీ ఇంకా అది షూట్ స్టార్ట్ అవలేదు.

More Related Stories