English   

మోడీ బ‌యోపిక్‌ లో వివేక్ ఒబేరాయ్‌ !

Vivek-Oberoi
2018-12-29 19:17:33

ప్రస్తుతం అన్ని బాషల్లో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్ అంటూ తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో వరుస పెట్టి బయోపిక్ లు తీస్తున్నారు. తెలుగులో మహానటి ఇప్పటికే రిలీజవగా ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా “ఎన్టీఆర్” బయోపిక్, వైఎస్ పాదయాత్ర ఆధారంగా యాత్ర రిలీజ్ కి సిద్దంగా ఉన్నాయి. అయితే బాలీవుడ్ లో ఎక్కువగా క్రీడాకారుల బయోపిక్ లే తెరకెక్కగా ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కావడంతో నేతల బయోపిక్ లు కూడా రెడీ అవుతున్నాయి. తాజాగా మన్మోహన్ సింగ్ బయోపిక్ ట్రైలర్ కూడా రిలీజయ్యింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ కూడా మొదలైంది. మేరీ కోమ్ బయోపిక్ తెరకెక్కించిన ఒమంగ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ ప్రాజెక్ట్ తెర‌కెక్క‌నుందట. అయితే దీనికి సంబంధించిన వ‌ర్క్ గ‌త ఏడాదిన్న‌ర నుండి జ‌రుగుతుంద‌ట‌. స్క్రిప్ట్‌, స్టోరీ, స్క్రీన్‌ప్లే త‌దిత‌ర అంశాల‌పై ఒమంగ్ కుమార్ టీం ఒక కొలిక్కి తెచ్చిందట. ప్రభుత్వం నుండి అనుమతి రాగానే చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్ళాల‌నే ఆలోచ‌న‌లో డైరెక్టర్ ఉన్నారట. అయితే బ‌యోపిక్‌లో ప్ర‌ధాని మోదీ పాత్ర కోసం బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబేరాయ్‌ని డైరెక్టర్ అప్రోచ్ అవగా ఆయన ఓకె చెప్పేశారట. ఇటీవల వచ్చిన బయోపిక్ లు అన్నిటిని బాగానే రిసీవ్ చేసుకున్నారు ప్రేక్షకులు.  మరి దీనిని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి మరి.

More Related Stories