English   

చిట్టిబాబు సమేత వినయ విధేయ రాముడు !

Back To Back Releases For Ram Charan Movies in Malayalam
2018-12-29 12:28:55

ఈ మ‌ధ్య కాలంలో తెలుగు హీరోల సినిమాల‌కి వేరే రాష్ట్రాల‌లోను మంచి డిమాండ్ ఏర్ప‌డిన‌ సంగ‌తి తెలిసిందే. అల్లు అర్జున్ , మ‌హేష్ బాబు, ప్రభాస్ లాంటి స్టార్ ల సినిమాలు ఇప్ప‌టికే వేరు వేరు భాష‌ల‌లో విడుద‌లై ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందాయి. అల్లు అర్జున్ మళయాళ మార్కెట్ పెంచుకంటే, బాహుబలి సిరీస్ తో ప్రభాస్ అయితే అన్ని బాషలలో మార్కెట్ పెంచేసుకున్నాడు. స్పైడర్ దెబ్బతో తమిళ్ మార్కెట్ కూడా పెంచుకునే పనిలో పడ్డాడు మహేష్ బాబు. అయితే అందుతున్న తాజా సమాచారం ఏంటంటే రామ్ చ‌ర‌ణ్ చిత్రాలు కూడా మ‌ల‌యాళంలో విడుద‌ల‌య్యేందుకు సిద్ధ‌మ‌య్యాయి. చ‌ర‌ణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచిన రంగ‌స్థ‌లాన్ని జ‌న‌వ‌రి 18న కేర‌ళ‌లో విడుద‌ల చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే మరో ఆసక్తికరమయిన విషయం ఏంటంటే చ‌ర‌ణ్ న‌టిస్తున్న తాజా చిత్రం విన‌య విధేయ రామ మూవీని జ‌న‌వ‌రి 25న రిలీజ్ చేయ‌నున్నారు. ఇదే చిత్రం తెలుగులో సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11నే విడుద‌ల కానుంది. అంటే వారం రోజుల గ్యాప్‌లో మ‌ల‌యాళంలో విడుద‌ల కానున్న రంగ‌స్థ‌లం, విన‌య విధేయ రామ చిత్రాలు అక్కడి ప్రేక్ష‌కుల‌కి వినోదాన్ని అందిస్తాయ‌ని, అల్లు అర్జున్ లానే చరణ్ కూడా అక్కడి ప్రేక్షకులను మెప్పించి పాగా వేస్తాడా లేదా అనేది వేచి చూడాలి. 

More Related Stories