English   

నాగార్జున ధనుష్ మల్టీస్టారర్ ఆగినట్టేనా ?

Dhanush Puts Nagarjuna Multi star Movie On Hold?
2018-12-30 10:35:58

నాగార్జున న‌టించిన ఊపిరి, దేవ‌దాస్ లాంటి మ‌ల్టీ స్టార‌ర్ ల‌కి మంచి క్రేజ్ తో పాటు కలెక్షన్ లు కూడా బానే రావ‌డంతో ధ‌నుష్‌ తో క‌లిసి మ‌రో మ‌ల్టీ స్టార‌ర్ చేస్తున్నాడని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ్ తో పాటు మరికొన్ని భాషల్లోకి ఒకేసారి నిర్మించాలని భావిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున‌తో పాటు ఎస్‌జే సూర్య‌, అదితిరావు,ధ‌నుష్‌ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా వాయిదా పడినట్టు సమాచారం. ఎందుకంటే ఈ చిత్రాన్ని తమిళంలో 100కు పైగా సినిమాలు నిర్మించిన తేనాన్డాల్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉండగా సదరు సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడమే కారణం అని అంటున్నారు. ఈ సంస్థే రూ.300 కోట్ల బడ్జెట్ తో ‘సంఘమిత్ర’ చిత్రాన్ని కూడా నిర్మించాలనుకుంది. కానీ ఆర్థిక సంక్షోభంలో పడి ఆ సినిమాను ఆపేసింది. దీంతో పాటుగా ‘రుద్ర’ విషయంలోనూ చేతులేత్తేసిందట. ప్రస్తుతం ఇంకో నిర్మాతను చూసుకుని సినిమా మొదలుపెట్టే పరిస్థితి లేకపోవడంతో ధనుష్ తాత్కాలికంగా ఆ సినిమాను ఆపేశాడట. మరి భవిష్యత్తులో ఏమైనా ఈ చిత్రం మొదలవుతుందేమో చూడాలి. ఈ నేపధ్యంలో చాలాకాలం తర్వాత తమిళంలో నటించాలనే నాగార్జున ఆశలకు గండిపడిందనే చెప్పాలి.

 

More Related Stories