English   

కాజల్ పై నెటిజన్ల ఫైర్...క్లారిటీ ఇచిన దర్శకుడు

Director ramesh aravind explanation on Kajal Agarwal's breast press controversy
2018-12-30 04:13:23

హిందీలో సూపర్ హిట్ అయిన 'క్వీన్' కు దక్షిణాది బాషలు నాలుగిటిలో విడివిడిగా రీమేక్స్ అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో 'దట్ ఈజ్ మహాలక్ష్మి' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ రీమేక్ 'ప్యారిస్ ప్యారిస్' లో కాజల్ అగర్వాల్ హీరొయిన్ గా నటిస్తోంది. ఈమధ్యే ఈ సినిమా ట్రైలర్లు రిలీజ్ అయ్యాయి. తెలుగు ట్రైలర్ కు పెద్దగా స్పందన దక్కలేదు గానీ తమిళ ట్రైలర్ మాత్రం పెను సంచలనమే రేపింది. ఎందుకంటే ట్రైలర్లో ఎల్లి అవ్రామ్ కాజల్ ను వక్ష స్థలాన్ని పట్టుకోవడమే ఈ సంచలనానికి కారణం. ఈ సీన్ సినిమాకు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. అయితే ఇలాంటి సీన్ లో నటించిన కాజల్ మీద నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనిలో పనిగా ఈ సీన్ పెట్టిన దర్శకుడి మీద కూడా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దీని మీద స్పందించిన రమేష్ మీ విమర్శల్లో వాస్తవం ఉంది, కానీ కాజల్ నటించిన ఆ దృశ్యం మీకు అశ్లీలంగా అనిపించొచ్చు కానీ దానికి ముందు , తర్వాత సీన్స్ చూస్తే ఆ సీన్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో అర్ధం అవుతుందని అంటున్నాడు. హిందీ క్వీన్ లో కూడా ఆ సీన్ ఉందని, కానీ ట్రైలర్ లో చూసినప్పుడు తప్పుగా అనిపించి ఉండొచ్చని  ట్రైలర్ మాత్రమే చూసి విమర్శలు చేయడం సరికాదన్నాడు.

More Related Stories