English   

సహజీవనం తప్పు కాదు....కానీ నేను చేయను

sai pallavi comments on living together relationship
2018-12-30 11:45:59

తెలుగులో తన మొదటి సినిమాతోనే యూత్ ని ఆకట్టుకున్న సాయిపల్లవి. తన నాచురల్ నటనతో అందరినీ అలరిస్తోంది. పెద్దగా మేకప్  వేయని ముఖం, నిండుగా దుస్తులు చూడగానే తెలుగమ్మాయిలా ముచ్చటగా కన్పిస్తోంది. ఎక్కువగా లవ్ బేస్డ్ సినిమాలే చేస్తున్న ఈ బ్యూటీ నిజజీవితంలో కూడా లవ్ లో పడింది. అయితే అది అబ్బాయి ప్రేమలో కాదులెండి కాలెజ్ డేస్ లో  పుస్తకాలతో, ఇప్పుడు సినిమాలతో ప్రేమలో ఉందట. అంతేకాక ఓ అమ్మాయి, అబ్బాయి వివాహం చేసుకోకుండా, సహజీవనం చేస్తే తప్పేమీ లేదని, అది వారిద్దరి మధ్యా ఉన్న అనుబంధం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయమని సాయి పల్లవి అంటోంది. ఈ మధ్య ఎవరినైనా ప్రేమిస్తున్నారా ? ఎవరితోనైనా కలిసుంటున్నారా ? వంటి ప్రశ్నలు ఎక్కువయ్యాయని, తనకు లివింగ్ టు గెదర్ సంబంధం వద్దని అలాగే సహజీవనానికి వ్యతిరేకినని కూడా చెప్పనని అంటోంది. తాను వైవాహిక జీవితాన్నే కోరుకుంటున్నానని చెప్పింది. మరోపక్క సాయిపల్లవి సూర్యతో కలసి నటించిన 'ఎన్జీకే' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమైంది. 

More Related Stories