English   

నాగ‌చైత‌న్య‌, స‌మంత మజిలీ ఫస్ట్ లుక్ విడుదల !

samantha naga chaithanya's majili movie first look
2018-12-30 15:32:14

వివాహం జరిగాక అక్కినేని నాగచైతన్య, సమంతా తొలిసారి కలిసి నటిస్తోన్న చిత్రం మజిలీ. నిన్నుకోరి దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని తాజాగా విడుదల చేశారు. ట్విట్టర్ లో నాగ చైతన్య ఈ ఫస్ట్ లుక్ ని విడుదల చేశాడు. ఇది తనకెంతో ప్రత్యేకమైన చిత్రమని ఎందుకంటే సమంతతో జంటగా నటిస్తున్న నాలుగో చిత్రమని కొత్త ఏడాదిని ఈ చిత్రంలో ఆరంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఏప్రిల్‌లో కలుద్దామని ట్వీట్ చేశారు. ఈ సినిమాకి దేర్ ఈజ్ ల‌వ్ దేర్ ఈజ్ పెయిన్ అనే క్యాప్షన్ పెట్టారు. అంటే ప్రేమా ఉంది, బాధా ఉంద‌ని అర్థం. ఈ చిత్ర ఫస్ట్ లుక్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంది. నాగచైతన్య, సమంత లుక్ ఇందులో చాలా కొత్తగా ఉంది. వైజాగ్ నేపథ్యంలో ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. ఈ ఫ‌స్ట్ లుక్‌ లో ఇద్దరూ ఒకరినొకరు ఆప్యాయంగా చూసుకుంటూ ఉండగా, బ్యాక్‌గ్రౌండ్‌లో వాల్తేరు గ్రౌండ్స్‌, విశాఖపట్నం అని రాసుంది. ఈ సినిమాలో చైతన్య మాజీ క్రికెటర్ గా, సమంత రైల్వే క్లర్క్ గా కనిపించనున్నట్లు ఫిలిం నగర్ టాక్. ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ రెండో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా విష్ణు వర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 

More Related Stories